మహానటి సావిత్రి పై ఆరోపణలు


gemini-ganesan-daughter-kamala-selvaraj-sensational-comments-on-savitri

మహానటి సావిత్రి చాలా మొండిదని అందుకే ఆమె జీవితం నాశనం అయ్యిందని , సావిత్రి జీవితం అర్దాంతరంగా ముగియడానికి కేవలం ఆమె మొండి వైఖరే కారణమని సంచలన ఆరోపణలు చేసింది జెమిని గణేషన్ కూతురు డాక్టర్ కమలా సెల్వరాజ్ . సావిత్రి కి అందమైన మనసు ఉందని , అందరికీ సహాయం చేసేదని ….. చాలా మంచిదని అయితే కొన్ని విషయాల్లో మాత్రం చాలా మొండి వైఖరి తో ఉండేదని ఆ యారోగెంట్ వల్లే ఆమె జీవితం నాశనం అయ్యిందని అంతేకాని మా నాన్న ( జెమిని గణేషన్ ) ఆమె జీవితాన్ని నాశనం చేయలేదని తప్పంతా సావిత్రి మీద నెట్టేసింది కమలా సెల్వరాజ్ .

నాన్న ఆమెతో ఉన్నప్పుడు ఆదాయపు పన్ను విషయాలు అన్నీ చూసుకునే వారు , కానీ ఎప్పుడైతే ఆమె మా నాన్న ని దూరం పెట్టిందో అప్పటి నుండి ఆమెకు సమస్యలు ముట్టాయని పక్కన ఉన్నవాళ్లు ఆమెని మోసం చేసారని అలాగే కొంతమంది బంధువులు కూడా ఆమె ఆస్థులను పోగు చేసుకున్నారని నాన్న మాత్రం ఈ విషయాలన్నీ చెప్పడానికి వెళితే అసలు మొహం చూడకుండా గెంటేసిందని అందుకే అప్పటి నుండి సావిత్రి దగ్గరకు వెళ్లలేదని సావిత్రి స్వయం కృతాపరాధం వల్లే ఇలా విషాదం అయ్యిందని అంటోంది కమలా సెల్వరాజ్ .