జెమిని గణేశన్ ఏడుగురు కూతుర్లు వీళ్ళే


Gemini Ganesan has seven daughtersసావిత్రి భర్త జెమిని గణేశన్ అన్న విషయం అందరికీ తెలిసిందే . స్త్రీ లోలుడు అయిన జెమిని గణేశన్ ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు ఇక నలుగురిలో ముగ్గురికి సంతానం కలుగగా అందులో ఏడుగురు ఆడవాళ్లు ఒక్కడే అబ్బాయి . మొత్తం ఎనిమిది మంది జెమిని గణేశన్ సంతానం . ఆ ఎనిమిది మందిలో మొదటి భార్య అలిమేలు కు డాక్టర్ జయ శ్రీధర్ , డాక్టర్ రెవితి స్వామినాధన్ , డాక్టర్ కమలా సెల్వరాజ్ ,నారాయణి గణేశన్ అనే నలుగురు కూతుర్లు .

ఇక రెండో భార్య పుష్పవల్లి కి బాలీవుడ్ హీరోయిన్ రేఖ , రాధా సయ్యద్ లు ఇద్దరు సంతానం , ఇక మూడో భార్య సావిత్రి కాగా ఆమెకు ఇద్దరు సంతానం అందులో విజయ చాముండేశ్వరి , సతీష్ లు . మొత్తం ఎనిమిది మంది జెమిని గణేశన్ సంతానం కాగా ఇటీవల చెన్నై లో ఏడుగురు జెమిని గణేశన్ కూతుర్లు కలిశారు దాంతో వాళ్ళ గ్రూప్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది . మహానటి విడుదల అయిన సమయంలో జెమిని గణేశన్ – సావిత్రి ల విషయాల పట్ల నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .