సావిత్రిని ఆర్ధికంగా దెబ్బకొట్టింది ఎవరో తెలుసా


gemini ganesan real villain to mahanati savitri

మహానటి సావిత్రి ఎన్నో అజరామరమైన విజయాలను సొంతం చేసుకొని ఎనలేని కీర్తి ప్రతిష్టలను ఆర్జించింది , అయితే చివరి రోజుల్లో ఆర్ధికంగా దెబ్బతినడంతో ఆమె పట్ల ఎనలేని సానుభూతి వ్యక్తం అవుతూనే ఉంది . మహానటి సావిత్రి చనిపోయి 37 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా సావిత్రి విషయాల పట్ల ఆసక్తిగానే ఉన్నారు తెలుగు ప్రజలు . అయితే ఎవరెన్ని చెప్పినా వినకుండా సావిత్రి జెమిని గణేశన్ ని రహస్య వివాహం చేసుకుంది , ఆ తర్వాత కూడా చాలామంది పెద్దలు , పలువురు హీరోయిన్ లు ఇతర నటీనటులు సావిత్రి ని హెచ్చరించినప్పటికీ జెమిని గణేశన్ తోనే ఉంది . అంటే సావిత్రి అతడ్ని ఎంతగా ప్రేమించిందో అర్ధం చేసుకోవచ్చు కానీ జెమిని గణేశన్ మాత్రం సావిత్రి ని అంతగా ప్రేమించలేదు పైగా సావిత్రి ని ఆర్ధికంగా దెబ్బకొట్టింది కూడా జెమిని గణేశన్ అనే అంటున్నారు అప్పటి విషయాలు బాగా తెలిసిన వాళ్ళు .

సావిత్రి పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉండేది , అయితే ఇది పెద్దగా జెమిని గణేశన్ కు నచ్చేది కాదంట ! అలాగే ఓ రెండు తెలుగు సినిమాల హక్కులను కొని తమిళ్ లో రీమేక్ చేసింది అవి చేయొద్దని ఖరా ఖండి గా చెప్పాడట ! ఆ మాట కూడా వినలేదు సావిత్రి అలాగే అదే సమయంలో జెమిని గణేశన్ కు ప్లాప్ లు రావడం సావిత్రి క్రేజ్ మరింతగా పెరగడం కూడా అతడికి నచ్చలేదు అన్నింటికంటే మిన్నగా ఒకదశలో సావిత్రి జెమిని గణేశన్ ని దూరంగా పెట్టిందట దాంతో అవమానంగా భావించిన జెమిని గణేశన్ తన పలుకుబడిని ఉపయోగించి ఇన్ కం టాక్స్ వాళ్ళు రైడ్ చేసేలా చేయడమే కాకుండా ఆర్ధికంగా మరింతగా దిగజారి పోయేలా చేస్తూ …… మానసికంగా కూడా దెబ్బ కొట్టాడట ! ఈ విషయం కొంతమంది కి మాత్రమే తెలుసట ! అయితే సావిత్రి ఎంతగా దెబ్బ కొట్టినా ఎవరి దగ్గరా చేయి చాచలేదు సహాయం కోసం అప్పటి అగ్ర హీరోలను ఎవరిని కూడా కోరలేదు కూడా . తానే ధైర్యంగా ఎదుర్కొంది కానీ ఒకదశలో ఆమె వల్ల కాలేదు అందుకే మానేసిన మద్యానికి మళ్ళీ అలవాటు అయ్యింది , చిన్న చిన్న వేషాలు కూడా వేసింది . నమ్మిన వాడు నట్టేట ముంచడంతో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది కేవలం 45 ఏళ్ల వయసుకే !