నాగ చైతన్య సినిమా సంగతి ఇలా లీకైపోయిందేంటి?


Gemini TV leaks Naga Chaitanya Dil Raju project
Gemini TV leaks Naga Chaitanya Dil Raju project

అక్కినేని నాగ చైతన్య సినిమా గురించి చాలా వెరైటీగా ఒక లీక్ వచ్చింది. అయితే చేసింది ఏ మీడియా సంస్థనో కాదు, ఒక ప్రముఖ టివి ఛానల్. ఇంకా ఆధికారికంగా ప్రకటించిన ఒక సినిమా సాటిలైట్ హక్కులు మేము తీసుకున్నామంటూ ప్రముఖ టివి ఛానల్ జెమినీ ప్రకటించింది. దాంతో అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఒకటి సెట్ అయిందనే చాలా మందికి తెలీదు. ఇక వివరాల్లోకి వెళితే..

దిల్ రాజు నాగ చైతన్యను జోష్ సినిమా ద్వారా లాంచ్ చేసాడు. అయితే ఆ తర్వాత ఎందుకనో వీరిద్దరూ కలిసి పనిచేయలేదు. ఇన్నాళ్ళకి వీరిద్దరూ కలిసి మళ్ళీ పనిచేయబోతున్నారు. రష్మిక మందన్న హీరోయిన్. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. ఇంతలోనే జెమినీ టివి వారు ‘అదే నువ్వు అదే నేను” అనే టైటిల్ తో రానున్న నాగ చైతన్య – దిల్ రాజు – రష్మిక మందన్న చిత్ర సాటిలైట్ హక్కులు మేము సొంతం చేసుకున్నాం అని ట్వీట్ చేసారు. అదీ సంగతి.