జెనీలియా సెకండ్‌ ఇన్నింగ్స్‌కు అంతా రెడీ!

జెనీలియా సెకండ్‌ ఇన్నింగ్స్‌కు అంతా రెడీ!
జెనీలియా సెకండ్‌ ఇన్నింగ్స్‌కు అంతా రెడీ!

జెనీలియా తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. `బొమ్మ‌రిల్లు` చిత్రంలో హ హా హాసిని అంటూ త‌న‌దైన మార్కు న‌ట‌న‌తో అల‌రించిన జెనీలియా `నా ఇష్టం` త‌రువాత నుంచి తెలుగు సినిమాకు గుడ్ బై చెప్పేసింది. బాలీవుడ్ హీరో, స్నేహితుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు జ‌న్మ‌నిచ్చింది.

గ‌త కొంత కాలంగా వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది. జెనీలియా గృహిణిగా త‌న బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తిస్తోంది. ఆమె మ‌ళ్లీ త‌న సెకండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేయ‌బోతోందంటూ వ‌రుస‌గా క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. అందుకు త‌గ్గ‌ట్టుగాను జెనీలియా తెలుగు స్టార్స్‌తో స‌న్నిహితంగా వుంటూ వ‌స్తోంది. ఇటీవ‌ల హీరో రామ్ తో క‌లిసి అల్ల‌రి చేస్తున్న ఓ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టిన విష‌యం తెలిసిందే.

భ‌ర్త రితేష్ దేశ్‌ముఖ్ కూడా జెనీలియా సెకండ్ ఇన్నింగ్స్‌కి స‌పోర్ట్‌గా నిలుస్తున్నార‌ట‌. దీంతో త్వ‌ర‌లోనే జెనీలియా తన రెండవ ఇన్నింగ్స్ ని  ప్రారంభించాలనుకుంటోంద‌ని తెలిసింది. హిందీతో పాటు,  దక్షిణాదిపై కూడా దృష్టి పెట్టాలని జెనీలియా ప్లాన్ చేస్తున్న‌ట్టు చెబుతున్నారు.