ఈ వారం జార్జ్ రెడ్డికే అడ్వాంటేజ్

George Reddy only option at box office
George Reddy only option at box office

ఈ వారం ఏకంగా ఆరు చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసేందుకు వచ్చాయి. అయితే వాటిలో మూడు సినిమాలే ప్రేక్షకుల దృష్టిని కొంతమేరకైనా ఆకర్షించాయి. ఉస్మానియా యూనివర్సిటీ లీడర్ జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ జార్జ్ రెడ్డి. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఫ్యామిలీ డ్రామా తోలుబొమ్మలాట. సత్యదేవ్, ఈషా రెబ్బ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన థ్రిల్లర్ రాగల 24 గంటల్లో. ఈ మూడు సినిమాల్లో జార్జ్ రెడ్డి కొంచెం యావరేజ్ రేటింగులు తెచ్చుకుంది. టాక్ కూడా జార్జ్ రెడ్డికి కొంచెం యావరేజ్ గా ఉంది. మిగతా రెండు సినిమాలకు ప్లాప్ టాక్ వచ్చింది. స్లో గా ఉందని, అసలు ఇంటరెస్ట్ లేదన్న కారణాలతో తోలుబొమ్మలాటను ప్రేక్షకులు రిజక్ట్ చేసారు. ఇక రాగల 24 గంటల్లో చిత్రం పేరుకే థ్రిల్లర్ అని అందులో థ్రిల్ అయ్యే అంశాలు ఏవీ లేవని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీనివాస రెడ్డి తొలిసారి థ్రిల్లర్ జోనర్ ను ట్రై చేసి బొక్కబోర్లా పడ్డాడు.

ఈ రెండు చిత్రాల టాక్ ప్లాప్ అవ్వడంతో జార్జ్ రెడ్డి మీదే ప్రేక్షకుల దృష్టి పడింది. నిజానికి జార్జ్ రెడ్డికి యావరేజ్ అనే టాక్ మాత్రమే వచ్చింది. ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో ఈ చిత్రం ఫెయిల్ అయిందట. అయితే పోటీగా వచ్చిన సినిమాలు ఏవీ ఆకట్టుకోకపోవడం, అప్పటికే రిలీజ్ అయిన చిత్రాలు కూడా మైనస్ గా మారడంతో ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద జార్జ్ రెడ్డి హవా చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వారం పాటు డీసెంట్ వసూళ్లు సాధిస్తే సేఫ్ అయిపోవచ్చు. ఇక వచ్చే వారం నిఖిల్ నటించిన అర్జున్ సురవరం, రామ్ గోపాల్ వర్మ చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలు విడుదల కానుండడంతో జార్జ్ రెడ్డి ఎంత తెచ్చుకున్నా కూడా ఈ వారంలోనే.