వంట చేయడానికి “దేనికైనా రెడీ”


Manchu Vishnu And Hansika
వంట చేయడానికి “దేనికైనా రెడీ”

నేను చెప్పేది ఏ వంట ప్రోగ్రామ్ గురించో, లేక వంట చేయాడానికి ముందు చెప్పే చిట్కాల గురించి కూడా కాదు.ఇది మన టాలీవుడ్ లో ఒక హీరో గురించి పేరుకి అతను డైలాగ్ కింగ్ “మంచు మోహన్ బాబు” కుమారుడు అయిన మన “మంచు విష్ణు” గారు.సినిమాల విషయానికి ఒస్తే ఇతగానికి సినిమాలు అంతగా కలిసి రావట్లేదనే చెప్పాలి. చూసుకుంటే ఇతను చేసిన సినిమాల విషయం లో కథ లేదనే చెప్పుకుంటున్నారు జనాలు, తనకి చివరగా హిట్ ఇచ్చిన సినిమా “ఈడోరకం ఆడోరకం” అది కూడా ఇద్దరు హీరోలు ఉన్న సినిమా. విష్ణు కి సహా కథానాయకుడిగా చేసిన “రాజ్ తరుణ్” కి కూడా ఈ సినిమా విజయం లో పాత్ర ఉంది, అంటే ఈ సినిమా కూడా విష్ణు కి సోలో గా పేరు రాలేదనే చెప్పాలి.

ఆ సినిమా కి ముందు సోలో హీరోగా చేసిన సినిమాలో హిట్ పరంగా చెప్పుకుంటే “దేనికైనా రెడీ” సినిమా గురించి మాట్లాడాలి, ఆ సినిమాలో మన వాడి హాస్య చతురత, వగైరా చెప్పుకుంటే పోతే ఆ సినిమా విష్ణు కి కానీ కథానాయికగా చేసిన “హన్సిక” కి కానీ బాగా పేరు సంపాదించింది. ఆ తరువాత వీళ్లిద్దరి కలయిక లో ఒచ్చిన సినిమా ఇంకోటి కూడా ఉంది కానీ అది జనాల మెప్పు పొందలేక డీలా పడిపోయింది.

అయితే వీళ్లిద్దరు ఇప్పుడు ఇంకొక సినిమా చేస్తున్నారో తెలీదు కాని, హీరో మంచు విష్ణు తన ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టాడు, అదేంటంటే “ఎప్పుడైతే మంచి స్నేహితుడు వంట చేస్తాడో” అని పోస్ట్ చేసాడు, జనరల్ గ ఇలాంటి పోస్ట్స్ ఎప్పుడు పెట్టని విష్ణు గారు ఇలాంటి పోస్ట్ పెట్టేసరికి ఫ్యాన్స్ అందరూ సినిమా గురించి ఎమన్నా చెప్తాడో అని వేచి చూస్తున్నారు. చూద్దాం మరి సినిమా గురించి చెప్తారా, లేక ఇది ఒక పోస్ట్ మాత్రమేనా అని.

Credit: Twitter