3 వ సీజన్ కి కూడా ప్రమోషన్ సాంగ్ – మోత మోగనుందా?BIGG BOSS 3 Telugu
3 వ సీజన్ కి కూడా ప్రమోషన్ సాంగ్ – మోత మోగనుందా?

బిగ్-బాస్ పేరు మొదట బాలీవుడ్ నుండి దిగుమతి అయిన పెద్ద సెలబ్రిటీ రియాలిటీ షో, మన టాలీవుడ్ లొ కేవలం 3 సీజన్స్ మాత్రమే ఉంటే అక్కడ బాలీవుడ్ లో 13 సీజన్స్! అంతలా ప్రాచుర్యం పొందిన పాపులారిటీ రియాలిటీ షో, చిన్న పిల్లల దగ్గరనుండి ఒక మోస్థరు వయసు వాళ్ళని కూడా ఆకట్టుకోగలిగే అంత మంచి ప్రాచుర్యం వున్న రియాలిటీ షో.

ఇక మన తెలుగు బిగ్-బాస్ విషయానికి వొస్తే మొదటి సీజన్ “Jr. Ntr” హోస్ట్ కాగా “శివబాలాజీ” టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఇక 2 వ సీజన్ విషయానికి వొస్తే “నాని” హోస్ట్ కాగా “కౌశల్-ఆర్మీ” పుట్టుకురావటం “కౌశల్ ” టైటిల్ కైవసం చేసుకోవటం జరిగింది. ఇక 3 వ సీజన్ కి “నాగార్జున” గారు హోస్ట్ కాగ ఇప్పటికే 55 రోజులు పూర్తిచేసుకుంది. ఇక 2 వ సీజన్ లో చాలా మంది బిగ్-బాస్ గురించి ప్రమోషనల్ సాంగ్స్ చేసారు అవి మనం చూసాం, ఇక 3 వ సీజన్ లో ఎపుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రమోషనల్ సాంగ్ ఈ రోజు సాయంత్రం యూట్యూబ్ ద్వారా రిలీజ్ కానుంది.