వరుణ్ తేజ్ చాలా మంచి వాడు అంటున్న దర్శకుడు

వరుణ్ తేజ్ చాలా మంచి వాడు అంటున్న దర్శకుడు
వరుణ్ తేజ్ చాలా మంచి వాడు అంటున్న దర్శకుడు

గత కొన్ని రోజులుగా మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న గని చిత్రం గురించి రకరకాల రూమర్స్ షికార్లు చేస్తోన్న విషయం తెల్సిందే. వరుణ్ తేజ్ కు, దర్శకుడు కిరణ్ కొర్రపాటి మధ్యన విబేధాలు తలెత్తాయని, వరుణ్ తేజ్ కథలో, దర్శకత్వంలో ఇన్వాల్వ్ అవ్వడం కొత్త దర్శకుడికి నచ్చలేదని రూమర్స్ వచ్చాయి.

అంతేనా ఈ సినిమా నిర్మాతలు అల్లు బాబీ, సిద్దుల మధ్య కూడా సరిగా పొసగట్లేదని, బడ్జెట్ పరిమితులు దాటడంతో వారి మధ్య మాటా మాట వచ్చిందని అంటున్నారు. అయితే ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.

దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ రూమర్స్ ను కొట్టిపారేశాడు. వరుణ్ తేజ్ పై ఇలాంటి రూమర్స్ ఎందుకు వస్తున్నాయో తనకు అర్ధం కావడం లేదంటున్నాడు. గని షూటింగ్ సాఫీగా సాగుతోందని అయితే హీరో చేతికి దెబ్బ తగలడంతో షూటింగ్ ను ఆపాల్సి వచ్చిందని ఈలోగా కోవిద్ సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ మరింత ఆలస్యమవుతోందని అంటున్నాడు. కొంత టాకీ పార్ట్, ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ తప్పితె గని షూటింగ్ మొత్తం పూర్తయ్యిందిట.