ప్రెస్టీజియస్ రెబెల్ స్టార్ ప్రభాస్ “సాహో” చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్


 Prabhas
Prabhas

‘బాహుబలి‘ 1, 2 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ రికార్డ్ స్థాయి వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇదిలావుంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ భారీ చిత్రానికి స్టార్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండడం విశేషం. రన్ రాజా రన్, విశ్వరూపం, జిల్ వంటి చిత్రాలతో మ్యూజిక్ లో స్పెషల్ ట్రెండ్ సృష్టించాడు జిబ్రాన్. సాహో చాప్టర్ 2 కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించింది కూడా జిబ్రానే కావడం తెలిసిందే. రన్ రాజా రన్ వంటి సూపర్ హిట్ చిత్రం చేసినప్పుడు దర్శకుడు సుజిత్ తో వర్క్ పరంగా జిబ్రాన్ కు మంచి అనుబంధం ఏర్పడింది. సాహో భారీ ప్రాజెక్ట్ కావడంతో టాలెంటెడ్ జిబ్రాన్ ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసేందుకు ఎంపిక చేసుకున్నామని చిత్రం దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకంగా నిలవనుంది. ప్రతీ సీన్ ని ఎలివేట్ చేసే విధంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీ రీ రికార్డింగ్ అందించనున్నారు జిబ్రాన్. ఇక ఈ సాహో చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా అగ‌స్ట్ 15 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయ‌ర్ గా విడుద‌ల కి సిద్ధ‌మౌతోంది.

యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బ్యానర్ – యువి క్రియేషన్స్
దర్శకుడు – సుజీత్
నిర్మాతలు – వంశీ-ప్రమోద్-విక్కీ
సినిమాటోగ్రాఫర్ – మధి
ఆర్ట్ డైరెక్టర్ – సాబు సిరీల్
ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్
పిఆర్వో – ఏలూరు శ్రీను