గిరీష్ కర్నాడ్ ఇక లేరు


ప్రముఖ నటులు , దర్శకుడు గిరీష్ కర్నాడ్( 81) ఈరోజు ఉదయం తన స్వగృహంలో కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గిరీష్ కర్నాడ్ మృతి వార్త క్షణాల్లో బయటకు పొక్కడంతో చిత్ర పరిశ్రమ తీవ్ర షాక్ కు గురయ్యింది. రంగస్థల నటులుగా విశేష ప్రాచుర్యం పొందిన గిరీష్ కర్నాడ్ నాటకరంగంలో చెరిగిపోని ముద్ర వేశారు. కేవలం నటుడిగానే కాకుండా రచయితగా , దర్శకుడిగా అటు రంగస్థలంలో ఇటు వెండితెరపై కూడా రాణించాడు.

81 ఏళ్ల వయసులో మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బతినడంతో కొంతకాలంగా మంచానికే పరిమితమయ్యాడు . ఈరోజు ఆరోగ్యం మరింతగా విషమించడంతో ఉదయం 6. 30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. గిరీష్ కర్నాడ్ తెలుగు , కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించాడు. గిరీష్ కర్నాడ్ మృతికి పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.