చెన్నైలో మొద‌లైన గొల్ల‌పూడి అంతిమ యాత్ర‌!


చెన్నైలో మొద‌లైన గొల్ల‌పూడి అంతిమ యాత్ర‌!
చెన్నైలో మొద‌లైన గొల్ల‌పూడి అంతిమ యాత్ర‌!

ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టులు, ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కులు, సాహితీ వేత్త గోల్ల‌పూడి మారుతీరావు అనారోగ్యంతో ఈ నెల 12న మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న కుటుంబ స‌భ్యులు విదేశాల్లో వుండ‌టంతో గొల్ల‌పూడి మారుతీరావు అంత్య‌క్రియ‌ల్ని కుటుంబ స‌భ్యులు ఆదివారానికి వాయిదా వేశారు. గ‌త కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న గొల్ల‌పూడి మారుతీరావు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ గురువారం మ‌ధ్యాహ్నం తుది శ్వాస విడిచిన విష‌యం తెలిసిందే.

విదేశాల నుంచి గొల్ల‌పూడి మారుతీరావు కుటుంబ స‌భ్యులు ఇండియాకు రావ‌డంతో ఆదివారం అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాట్లు చేశారు. ఆదివారం గొల్ల‌పూడి అంతిమ యాత్ర చెన్నైలోని టీ న‌గ‌ర్ నుంచి ప్రారంభ‌మైంది. అక్క‌డి నుంచి క‌న్న‌మ్మపేట శ్మ‌శాన వాటిక వ‌ర‌కు అంతిమ యాత్ర కొన‌సాగ‌నుంది. అక్క‌డే గొల్ల‌పూడి అంతిమ సంస్కారాల‌ను ఆయ‌న పెద్ద‌కుమారుడు సుబ్బారావు నిర్వ‌హించ‌నున్నారు. నిన్న సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు గొల్ల‌పూడి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. చిరంజీవి చెన్నై వెళ్లి గొల్ల‌పూడి కుటుంబ స‌భ్యుల్ని ప‌రామ‌ర్శించారు. ప్ర‌ముఖ గాయ‌కుడు బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం గొల్ల‌పూడి భౌతిక కాయాన్ని కి ఈ రోజు నివాళులు అర్పించారు.