గంధపు చెక్కల స్మగ్లర్ అల్లు అర్జున్


Allu Arjun
Allu Arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్ గా నటించనున్నట్లు ఇంతకుముందు చూచాయగా తెలిసింది కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అది నిజమే నట ! పైగా మహేష్ బాబు సుకుమార్ ని లైన్ లో పెట్టి పెట్టి విసిగించిన కథే నట !అయితే మహేష్ బాబు హ్యాండ్ ఇవ్వడంతో అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లగా అల్లు అర్జున్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు .

కట్ చేస్తే ఈనెలలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది , ఇక రెగ్యులర్ షూటింగ్ మాత్రం సెప్టెంబర్ నుండి సాగనుంది . దక్షిణాది రాష్ట్రాలను వణికించిన గంధపు చెక్కల స్మగ్లర్ పాత్రలో నటించనున్నాడు అల్లు అర్జున్ . ఈ హీరోకు నిజంగానే ఈ క్యారెక్టర్ అద్భుతంగా సెట్ అవుతుంది అనడంలో సందేహమే లేదు . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు .