మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్


మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ . మహేష్ బాబు కొత్త సినిమా మే 31న ప్రారంభం కానుంది . అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు కొత్త సినిమా ప్రారంభం కానుంది . ఇక మే 31 న విశేషం ఏంటంటే ……… మహేష్ బాబు తండ్రి హీరో కృష్ణ పుట్టినరోజు కావడం . తన తండ్రి పుట్టినరోజున కొత్త సినిమా ప్రారంభించనున్నాడు మహేష్ , అయితే ఈ ప్రారంభంలో మాత్రం మహేష్ బాబు మాత్రం పాల్గొనడం లేదు .

కొత్త సినిమా ఓపెనింగ్ రోజున మహేష్ బాబు పాల్గొనడు ఎందుకంటే అది మహేష్ సెంటిమెంట్ . చాలాకాలంగా మహేష్ బాబు ఇదే సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడు . వరుస విజయాలు సాధిస్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ సినిమా చేస్తుండటంతో మహేష్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు . అనిల్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలన్నీ సూపర్ హిట్స్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి . ఇక ఈ చిత్రానికి రెడ్డి గారి అబ్బాయి , సరిలేరు నీకెవ్వరూ అనే టైటిల్ లను పరిశీలిస్తున్నారు .