పవన్ కళ్యాణ్ – చరణ్ ల కాంబినేషన్ లో సినిమా ?


Pawan Kalyan And Ram Charan
Pawan Kalyan And Ram Charan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లి దారుణంగా దెబ్బతిన్నాడు . దాంతో అటు రాజకీయాలకు పనికి రాకుండా ఇటు సినిమాలు చేయకుండా ఉండిపోతున్నాడు అయితే సరిగ్గా ఇదే సమయంలో రాంచరణ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది .

గెస్ట్ అప్పియరెన్స్ అంటే అలా వచ్చి ఇలా వెళ్లిపోయే క్యారెక్టర్ కాదు సుమా ! సినిమాకు ఆయువుపట్టులాంటి క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది . పవన్ కళ్యాణ్ మళ్ళీ హీరోగా నటించడం దాదాపుగా సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే రాజకీయాల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాడట ! పైగా హీరోయిన్ లతో డ్యూయెట్స్ పాడటం ఇంకా బాగుండదు కాబట్టి కీలక పాత్రల్లో నటిస్తే అది కూడా లిమిటెడ్ గా చరణ్ సినిమాలో చేసే ఆలోచనలో ఉన్నాడట పవన్ . నిజంగా ఇది నిజమే అయితే మెగా ఫ్యాన్స్ కు అసలు సిసలైన పండగే అని చెప్పాలి .