నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్

Good news for nandamuri fansనందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ ఏంటంటే ……… ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్ర విజయోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ వస్తుండటం . బాలకృష్ణ బాబాయ్ తో అబ్బాయ్ ఎన్టీఆర్ కలిసి ఉన్న దృశ్యాలు చూడాలని నందమూరి అభిమానులకు ఎప్పటి నుండో కోరిక అయితే అది 2009 ఎన్నికల సమయంలో కుదిరింది తప్ప మళ్ళీ దాదాపు పదేళ్ళ కు ఇప్పుడు బాబాయ్ – అబ్బాయ్ కలిసి ఒకే వేదిక మీద కనిపించి కనువిందు చేయనున్నారు . బాలయ్య కు ఎన్టీఆర్ కు అంతగా పొసగడం లేదన్న విషయం తెలిసిందే . అయితే ఇటీవలే నందమూరి హరికృష్ణ మరణంతో నందమూరి కుటుంబం ఒక్కటయ్యింది .

దాంతో అరవింద సమేత వీర రాఘవ ప్రీ రిలీజ్ వేడుకకు బాలయ్య రానున్నట్లు వార్తలు వచ్చాయి కానీ బాలయ్య రాలేదు కట్ చేస్తే అరవింద సమేత హిట్ అయిన నేపథ్యంలో విజయోత్సవ వేడుకకు బాలయ్య చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు . దాంతో నందమూరి అభిమానులకు పండగే పండగ . బాబాయ్ – అబ్బాయ్ లు కలిసి ఉన్న ఫోటో పదిలంగా పెట్టుకోవడానికి రెడీ అవుతున్నారు . ఇక ఫోటో గ్రాఫర్ లకు కూడా మంచి గిరాకీ ఎందుకంటే ఆ ఫోటోలకు డిమాండ్ ఉంటుంది కాబట్టి . నందమూరి కుటుంబంలో అరమరికలు లేకుండా అందరూ కలిసి ఉంటే అదే నిజమైన పండగ నందమూరి అభిమానులకు . ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో అరవింద సమేత విజయోత్సవ వేడుక నందమూరి అభిమానుల సమక్షంలో జరగనుంది .

English Title: Good news for nandamuri fans