ఎన్టీఆర్ పై ప్రేమ కురిపిస్తున్న బాలయ్య


Good news for nandamuri fans

అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్ పై ఎనలేని ప్రేమని కురిపిస్తున్నాడు బాబాయ్ నందమూరి బాలకృష్ణ . నందమూరి హరికృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడంతో నందమూరి కుటుంబం ఒక్కటయ్యింది . కొంతకాలం క్రితం వరకు బాలయ్య బాబాయ్ తో ఎన్టీఆర్ కు పొసగలేదు అలాగే హరికృష్ణ కు బాలకృష్ణ కు కూడా విబేధాలు తీవ్ర స్థాయిలో ఉండేవి దాంతో మాటలు కూడా లేకుండాపోయాయి . కట్ చేస్తే హరికృష్ణ మరణంతో విబేధాలు పక్కకు పోయాయి నందమూరి కుటుంబం నారా కుటుంబం ఒక్కటే అన్న సంకేతాలు వెలువడుతున్నాయి .

ఇక బాలయ్య బాబాయ్ అయితే అబ్బాయ్ ఎన్టీఆర్ పై ప్రేమని కురిపిస్తున్నాడు . అన్నయ్య మరణంతో ఎన్టీఆర్ కు కళ్యాణ్ రామ్ కు తానే పెద్ద దిక్కుగా ఉండాలని అనుకుంటున్నాడట బాలయ్య . కళ్యాణ్ రామ్ అంటే బాలయ్య బాబాయ్ కి కోపం ఏమిలేదు కాకపోతే ఎన్టీఆర్ అంటేనే కాస్త కోపం ఉండేది ఇపుడు ఆ కోపం పోయింది దాంతో బాలయ్య బాబాయ్ ఇద్దరు అన్నాదమ్ములకు పెద్ద దిక్కు కానున్నాడు . ఇలాగే బాబాయ్ తో ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు కలిసి ఉంటే నందమూరి కుటుంబానికి అలాగే ఆ కుటుంబ అభిమానులకు పెద్ద పండగ అన్నమాటే !

English Title: Good news for nandamuri fans