భాద్యతాయుతమైన బూతు చిత్రం Good Newzz ట్రైలర్ రిలీజ్భాద్యతాయుతమైన బూతు చిత్రం Good Newzz ట్రైలర్ రిలీజ్
భాద్యతాయుతమైన బూతు చిత్రం Good Newzz ట్రైలర్ రిలీజ్

ప్రపంచంలో old is gold అని ఒక సామెత ఉంది. బాలీవుడ్ లో ప్రస్తుతం ఒక సిద్ధాంతం బాగా ఎక్కేసింది. అదే “bold is gold”. క్రైమ్, కామెడీ, యాక్షన్, బయోపిక్ ఇవన్నీ అయిపోయిన తర్వాత సౌత్ ఇండియా కథల మీద పడి, ఇప్పుడు అవి కూడా సరిపోక అడల్ట్, డార్క్ కామెడీ, బోల్డ్ సినిమాలు తీసి, జనాల మీదకి వదులుతున్నారు బాలీవుడ్ క్రియేటర్స్. ఇక ప్రస్తుతం విషయానికి వస్తే బాలీవుడ్ లో కరణ్ జోహార్ అనే ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. ఆయన ఆడ, మగ, తేడా నా అనే క్లారిటీ ఇప్పటికీ జనాలకి ఇవ్వడు. కానీ సమాజంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను కించపరిచే విధంగా సినిమాలు తీస్తాడు. ఆయన యొక్క మేధస్సు నుంచి వస్తున్న మరొక ఉత్తమ జాతి కథా చిత్రమే గుడ్ న్యూస్. కరణ్ జోహార్ అనే వ్యక్తి నా చిన్నప్పుడు 2006లోనే kabhi alvida na kehna అనే ఒక సినిమా తీశాడు పెద్ద స్టార్స్ , పెద్ద బడ్జెట్ పెట్టుకొని అమెరికాలాంటి బ్యాక్డ్రాప్ లో ఆ సినిమా తీసి చేసింది ఏంట్రా అంటే, “ఒకరికి ఒకరు నచ్చినప్పుడు, ఒకరి పెళ్ళాన్ని ఇంకొకడు తగులుకోవడంలో తప్పులేదు” అనే సభ్యసమాజానికి మెసేజ్ ఇచ్చాడు

ఇప్పుడు రిలీజ్ అవుతున్న గుడ్ న్యూస్ సినిమా కథకి వస్తే ఇద్దరు కపుల్స్. ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ ట్రై చేస్తారు. కాకపోతే డాక్టర్ చేసిన చిన్న తప్పు వల్ల, ఒకరికి వెళ్లాల్సిన sperm ఇంకొకళ్ళకి వెళుతుంది. అప్పుడు టెక్నికల్ గా చెప్తే, ఒకరి భార్య కడుపులో ఇంకొకరి బిడ్డ పెరుగుతూ ఉంటుంది. ఇలా లాక్ అయిన script ఎమోషనల్ గా, కామెడీగా అదేవిధంగా మనుషుల యొక్క నమ్మకాలను, భావోద్వేగాలను, సున్నితమైన ఇటువంటి అంశాలను చర్చించే విధంగా ఈ సినిమా ఉండవచ్చు అని కోరుకుంటున్నా. కాకపోతే ప్రచార చిత్రాలలో ఈ సినిమా లో ఉన్నటువంటి బోల్డ్ అంశాలకే ప్రాధాన్యత కల్పించారు. ప్రస్తుతం రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ఒక్క రోజులోనే 26 మిలియన్ views సాధించింది. చాలా రోజుల తర్వాత కరీనాకపూర్ తెరమీద ఎంతో అందంగా కనిపించింది. అక్షయ్ కుమార్ యాక్టింగ్ కి పేరు పెట్టేది లేదు.బాలీవుడ్ యువ నటుడు దాల్జీత్ సింగ్ మరియు ప్రస్తుత బాలీవుడ్ సంచలనం కియారా అద్వానీ ఇందులో నటించారు. ఈ చిత్రం ఈ సంవత్సరం క్రిస్మస్ ఈ సీజన్లో థియేటర్ ముందుకు రానుంది.