తొలిప్రేమ తొలిరోజు బాగానే రాబట్టింది


Good openings for Tholiprema వరుణ్ తేజ్ -రాశిఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్సకత్వంలో భోగవల్లి ప్రసాద్ నిర్మించిన తొలిప్రేమ చిత్రం తొలిరోజు మంచి వసూళ్ల ని రాబట్టింది. ఈనెల 9న విడుదలైన ఇంటలిజెంట్ , గాయత్రి చిత్రాలు డిజాస్టర్ కావడంతో తొలిప్రేమ కు బాగానే కలిసొచ్చింది. ఒకేరోజు మూడు చిత్రాలు రావడం వల్ల అందరికీ నష్టం అని భావించిన తొలిప్రేమ యూనిట్ ఒకరోజు ఆలస్యంగా అంటే ఫిబ్రవరి 10న సినిమాని విడుదల చేసారు. కట్ చేస్తే అదే తొలిప్రేమ కు ప్లస్ అయ్యింది.
ఆ రెండు సినిమాలు ప్లాప్ కావడం, తొలిప్రేమ యూత్ ని అలరించే చిత్రం కావడంతో మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల వరకు రాబట్టింది. వరుణ్ తేజ్ కు ఫిదా తర్వాత వచ్చిన చిత్రం కావడంతో అతడి కెరీర్ కి మంచి ఊపు వచ్చేలా ఉంది. వరుసగా రెండు సక్సెస్ లతో వరుణ్ చాలా సంతోషంగా ఉన్నాడు. భోగవల్లి ప్రసాద్ కూడా ఈమధ్య ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్నాడు సరిగ్గా అలాంటి సమయంలో ఈ తొలిప్రేమ వచ్చి ఆక్సిజన్ అందించింది.