జనతా కర్ఫ్యూకు అపూర్వ స్పందన

Good response for Janata curfew
Good response for Janata curfew

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటలవరకూ ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పాటించాలనే విజ్ఞప్తికి ప్రజలనుండి అపూర్వ స్పందన వస్తోంది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయ్యి కరోనా వైరస్ ఇంకా వ్యాపించకుండా.. వైద్య,ఆరోగ్య శాఖ వారు నివారణ చర్యలు తీసుకోడానికి సహకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన… ఢిల్లీ,ముంబై, హైదరాబాద్ సహా రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.  ప్రజలందరూ తమ తమ పనులను వాయిదా వేసుకుని ప్రయాణాలలో కూడా వాయిదా వేసుకుని ఇళ్లల్లో ఉండి సంఘీభావం పాటిస్తున్నారు. వైద్యము,అగ్నిమాపక, అత్యవసర సేవలు ఇతర వ్యవహారాలు అన్నీ కూడా మూసివేయబడ్డాయి. ట్రాఫిక్ పోలీసులు నిరంతరం రోడ్లపై ప్లకార్డులు పట్టుకొని కరోనా వైరస్ పై అవగాహన తో కూడినటువంటి నినాదాలు ప్రదర్శిస్తున్నారు.

ఇక దేశవ్యాప్తంగా ఎక్కువగా కేసులు నమోదు అవుతున్న మహారాష్ట్రలో అయితే ముంబై నగరంలో బాంద్రా-వర్లి వంతెన బైక్ సిటీ కనెక్ట్ అయ్యే రోడ్డు ముంబై నిర్మానుష్యంగా ఉండటం గమనించవచ్చు హైదరాబాదులో కూడా ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్లు సైతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అయితే శనివారం సాయంత్రం నుండి రాత్రి వరకు మాత్రం అనేకమంది ప్రజలు నిత్యావసర సరుకులు, కూరగాయలు, పళ్ళు, మాంసం మందులు ఇలాంటివి భారీ ఎత్తున కొనుగోలు చేస్తూ లపై రద్దీగా కనిపించారు. కేవలం ఒక్కరోజు కర్ఫ్యూ అయినంత మాత్రాన ప్రజలలో ఇలాంటి భయాందోళనలు చోటు చేసుకోవడం మంచి పరిణామం కాదు.