గూఢచారి వారం రోజుల కలెక్షన్లు


goodachari 1st week world wide collectionsకొత్త దర్శకుడు శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో అడవి శేష్ హీరోగా నటించిన చిత్రం ” గూఢచారి ”. ఆగస్టు 3న విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజునే హిట్ టాక్ వచ్చింది . ఇక వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 6. 90 కోట్ల షేర్ ని రాబట్టి మొదటి వారంలోనే పెట్టిన పెట్టుబడి ని సాధించిన చిత్రంగా నిలిచింది . రా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు . విభిన్న తరహా చిత్రాలను కోరుకునే వాళ్లకు గూఢచారి మంచి ఛాయిస్ అయ్యింది . అడవి శేష్ , శోభిత ధూళిపాళ , సుప్రియ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ , స్క్రీన్ ప్లే అడవి శేష్ అందించడం విశేషం .

ఇక ఏరియాల వారీగా గూఢచారి వసూళ్లు ఇలా ఉన్నాయి .

నైజాం – 2. 20 కోట్లు
సీడెడ్ – 40 లక్షలు

నెల్లూరు – 12 లక్షలు

గుంటూరు – 31 లక్షలు

కృష్ణా – 46 లక్షలు

వెస్ట్ – 20 లక్షలు

ఈస్ట్ – 35 లక్షలు

ఉత్తరాంధ్ర – 56 లక్షలు

రెస్ట్ ఆఫ్ ఇండియా – 50 లక్షలు

ఓవర్ సీస్ – 1.80 కోట్లు

మొతం – 6. 90 కోట్లు

English Title: goodachari 1st week world wide collections