ఇటలీలో గోపీచంద్ “చాణక్య”


Gopichand
Gopichand

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం చాణక్య. తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెహ్రీన్ పిర్జాద, జరీన్ ఖాన్ హీరోయిన్స్..

ఈ చిత్రం పాటల కోసం ఇటలీ లోని మిలాన్ కి వెళ్తున్నారు చిత్ర యూనిట్. అక్కడ అందమైన ప్రదేశాలలో పాటల్ని రాజు సుందరం నృత్య దర్శకత్వంలో చిత్రీకరించనున్నారు. విశాల్ సంగీతాన్ని అందిస్తుండగా వెట్రి తనదైన స్టయిల్ లో ఫోటోగ్రఫీ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారని సమాచారం..!!