దసరా పోటీల్లో గోపీచంద్ ‘చాణక్య’


Gopichand Chanakya Movie release date
Gopichand Chanakya Movie release date

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ `చాణక్య‌`. తమిళ దర్శకుడు తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ఇట‌లీ, మిలాన్‌లో పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది.

అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని ద‌స‌రాకు విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. గోపీచంద్ స‌ర‌స‌న మెహ‌రీన్, జరీన్ ఖాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. యాక్షన్ చిత్రాలు తీయటంలో తిరు ది సపరేట్ స్టైల్ అనే చెప్పాలి. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇక ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అంత అద్భుతంగా ప్రతి సినిమాని ఫ్యాషన్ తో రిచ్ గా నిర్మిస్తాయి. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.. దసరా బరిలో సైరా నరసింహారెడ్డి, వెంకీ మామ, రాజు గారి గదికి-3, వీటోతో పాటు మరికొన్ని చిన్న చిత్రాలు విడుదలకానున్నాయి.. మరి ఈ దసరా పోటీల్లో ఏ చిత్రం బాక్సా పీస్ వద్ద పరుగులు తీస్తుందో చూడాలి మరీ..!!