తమిళ దర్శకులని నమ్ముకుని మునిగిపోయిన గోపీచంద్

తమిళ దర్శకులని నమ్ముకుని మునిగిపోయిన గోపీచంద్
తమిళ దర్శకులని నమ్ముకుని మునిగిపోయిన గోపీచంద్

ప్రస్తుతం యాక్షన్ హీరో గోపీచంద్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అతను హిట్ కొట్టి చాలా కాలమే అయింది. చేసిన సినిమాలు చేసినట్లే టపా కట్టేశాయి. కొన్ని సినిమాలు కంటెంట్ బాగున్నా కానీ ఎందుకో సరైన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. రీసెంట్ గా వచ్చిన చాణక్య అయితే డిజాస్టర్లలోనే కొత్త స్టాండర్డ్ సెట్ చేసింది.

గోపీచంద్ కెరీర్ లో ఒకటి గమనిస్తే రీసెంట్ గా తమిళ దర్శకులని నమ్ముకుని దెబ్బైపోయాడు. ఇప్పుడు వచ్చిన చాణక్య సినిమాని తమిళ దర్శకుడు తిరు తెరకెక్కించాడు. కథ బానే ఉన్నా టేకింగ్ లో లోపాలతో సినిమా డిజాస్టర్ గా మిగిలింది. దీనికి ముందు వచ్చిన ఆక్సిజన్ చిత్రాన్ని మరో తమిళ దర్శకుడు జ్యోతికృష్ణ తెరకెక్కించాడు.

ఈ సినిమా కూడా తెలుగు ప్రేక్షకుల అభిరుచిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైంది. తప్పుల నుండి గోపీచంద్ పాఠాలు నేర్చుకోక తమిళ దర్శకులతో యాక్షన్ సినిమాలు చేయడంతో పూర్తిగా తేడా కొట్టేస్తోంది. ఇకనైనా గోపీచంద్ మేల్కొనకపోతే ఇక హీరోగా కంటిన్యూ అవ్వడం దాదాపు అసాధ్యం.