బాల‌య్య – `క్రాక్‌` డైరెక్ట‌ర్ మూవీకి ముహూర్తం ఫిక్స్‌!

Gopichand Malineni and Balakrishna film muhurtham date locked
Gopichand Malineni and Balakrishna film muhurtham date locked

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన చిత్రం `క్రాక్‌`. హైవోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం సంక్రాంతి బ‌రిలో నిలిచి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీతో ర‌వితేజ‌, గోపీచంద్‌ల కాంబినేష‌న్ హ్యాట్రిక్ హిట్‌ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ఇచ్చిన స‌క్స్ జోష్‌లో వున్న ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని మ‌రో మాస్ మ‌సాలా ఎంట‌ర్‌టైన‌ర్‌కి రెడీ అయిపోతున్నాడు.

`క్రాక్‌` హిట్‌తో మాంచి జోష్ మీదున్న గోపీచంద్ మ‌లినేని స్టార్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ఇటీవ‌ల ఓ హైవోల్టేజ్ యాక్ష‌న్ డ్రామాని వినిపించార‌ట‌. త‌న మార్కు మాస్ అంశాలు వుండ‌టంతో బాల‌య్య ఈ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. కాగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో నిర్మించ‌బోతోంది. ఇందు కోసం ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేశారు.

మే 28న ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభిస్తున్నార‌ని తెలిసింది. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌ని ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని ప్రారంభించిన‌ట్టు చెబుతున్నారు. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ మాస్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది.