`క్రాక్` నిర్మాత‌పై డైరెక్ట‌ర్ కంప్లైంట్‌!

`క్రాక్` నిర్మాత‌పై డైరెక్ట‌ర్ కంప్లైంట్‌!
`క్రాక్` నిర్మాత‌పై డైరెక్ట‌ర్ కంప్లైంట్‌!

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `క్రాక్‌`. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఠాగూర్ మ‌ధు నిర్మించిన ఈ చిత్రం ఈ సంక్రాంతికి జ‌న‌వ‌రి 9న విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీ ముందు రోజు ఆర్థిక కార‌ణాల వ‌ల్ల ఆల‌స్యంగా విడుద‌లైనా అనూహ్య విజ‌యాన్ని సాధించింది.

బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేనిల కాంబినేష‌న్‌కి హ్యాట్రిక్ హిట్‌ని అందించింది. అయితే రిలీజ్‌కి ముందు ఆర్థిక కార‌ణ‌ఫాల‌తో వార్త‌ల్లో నిలిచిన ఈ చిత్రం రిలీజ్ త‌రువాత కూడా అదే కార‌ణాల‌తో వార్త‌ల్లో నిలుస్తోంది. ర‌వితేజ కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచిన ఈ చిత్రం 50 కోట్ల‌కు పైగా గ్రాస్‌ని వ‌సూలు చేసి రికార్డు సృష్టించింది.

స్టార్ మాతో పాటు ఆహ‌కి ఈ చిత్ర డిజిట‌ల్ ప్ర‌ద‌ర్శ‌న హ‌క్కుల్ని అమ్మేసిన నిర్మాత ద‌ర్శ‌కుడికి మాత్రం బ్యాలెన్స్ డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ట‌. ఇదే విష‌యాన్ని ఆరోపిస్తూ ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌కుల సంఘాన్ని ఆశ్ర‌యించారు. దీంతో వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ద‌ర్శ‌కుల సంఘాన్ని నిర్మాత ఠాగూర్ మ‌ధుపై చర్య‌లు తీసుకోవ‌డానికి రెడీ అవుతున్నార‌ట‌.