`క్రాక్‌` త‌రువాత కిర్రాక్ కాంబినేష‌న్‌లో..!

`క్రాక్‌` త‌రువాత కిర్రాక్ కాంబినేష‌న్‌లో..!
`క్రాక్‌` త‌రువాత కిర్రాక్ కాంబినేష‌న్‌లో..!

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `క్రాక్‌`. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఠాగూర్ మ‌ధు నిర్మించిన ఈ చిత్రం ఈ సంక్రాంతికి జ‌న‌వ‌రి 9న విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీతో గ‌త కొంత కాలంగా స‌క్సెస్‌లు లేని హీరో ర‌వితేజ‌, ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చారు.

`క్రాక్‌` హిట్‌తో మాంచి జోష్ మీదున్న గోపీచంద్ మ‌లినేని త్వ‌ర‌లో నంద‌మూరి బాల‌కృష్ణ‌తో క‌లిసి మ‌రో మాస్ మసాలా ఎంట‌ర్‌టైన‌ర్‌ని చేయ‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన టాక్స్ ఇప్ప‌టికే పూర్త‌య్యాయి, ద‌ర్శ‌కుడికి మైత్రీ మూవీమేక‌ర్స్ అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. ద‌ర్శ‌కుడు ఇందుకు సంబంధించిన క‌థ‌ని కూడా ప‌క్కాగా పూర్తి చేసేశారు.

`క్రాక్‌`లో ర‌వితేజ పాత్ర‌ని గోపీచంద్ పోట్రేట్ చేసిన తీరు చూసిన వారంతా బాల‌య్య‌, గోపీచంద్ మ‌లినేని మ‌రోసారి ఇదే త‌ర‌హా మాస్ మ‌సాలా యాక్ష‌న్ క‌థ‌తో రాబోతున్నారని, వీరిది కిర్రాక్ కాంబినేష‌న్‌గా నిల‌వ‌నుంద‌ని అంతా అంటున్నారు. బాల‌య్య పాత్ర‌ని ఈ చిత్రంలో గోపీచంద్ మ‌లినేని చాలా కొత్త పంథాలో ఆవిష్క‌రించ‌బోతున్నార‌ట‌. ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న యాక్ష‌న్ చిత్రంలో బాల‌‌కృష్ణ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ త‌రువాతే గోపీచంద్ మ‌లినేని మూవీ ప‌ట్టాలెక్క‌నుంద‌ట‌.