హీరోగా గోపీచంద్ పనైపోయినట్టేనా?

హీరోగా గోపీచంద్ పనైపోయినట్టేనా?
హీరోగా గోపీచంద్ పనైపోయినట్టేనా?

యాక్షన్ హీరో గోపీచంద్ కెరీర్ కొన్నేళ్ల క్రితం బాగానే ఉండేది. యాక్షన్ సినిమాలు, యాక్షన్ తో మిళితమైన కామెడీ చిత్రాలతో గోపీచంద్ హిట్స్ అందుకున్నాడు. అయితే తర్వాత్తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. సరైన కథలు దొరక్క గోపీచంద్ ఇబ్బంది పడ్డాడు. అలా అని చెప్పి తన పంథా మార్చుకోలేదు. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల వైపు తొంగిచూడలేదు. తనకు వచ్చిన యాక్షన్ సినిమాలే చేసుకుంటూ వెళ్లి దెబ్బతిన్నాడు.

ప్రస్తుతం హీరోగా గోపీచంద్ మార్కెట్ పూర్తిగా డౌన్ అయింది. దానికి నిదర్శనం చాణక్య చిత్రానికి వస్తున్న కలెక్షన్స్. ఎంత సైరాకు పోటీగా ఉన్నప్పటికీ, ఎంత బ్యాడ్ రివ్యూలు వచ్చినప్పటికీ దసరా సీజన్లో రావాల్సిన కలెక్షన్లు అయితే కాదివి. మరీ తీసికట్టు వసూళ్లతో చాణక్య డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. ఓవర్సీస్ లో అయితే కలెక్షన్స్ లేక షోలు ఆపేయాల్సిన పరిస్థితి.

హీరోగా పూర్తిగా డౌన్ అయిపోయిన గోపీచంద్, ఇకపై నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో తమన్నా హీరోయిన్ గా సినిమా చేస్తున్నాడు గోపీచంద్. ఈ చిత్రం కూడా అటూ ఇటూ అయితే ఇక క్యారెక్టర్ పాత్రలవైపు గోపీచంద్ వెళ్లడం బెటర్.