మారుతీ నెక్స్ట్ మూవీ పక్కా కమర్షియల్!


మారుతీ నెక్స్ట్ మూవీ పక్కా కమర్షియల్!
మారుతీ నెక్స్ట్ మూవీ పక్కా కమర్షియల్!

ఆసక్తికర కథాంశాలతో సినిమాలు తీయడం మారుతి స్పెషలిటీ. మారుతీతో సినిమా తీసి హిట్ కొడితే ఆ లాభాలు ఓ రేంజ్ లో ఉంటాయి. ఎందుకంటే మారుతి తన సినిమాలను అనుకున్న బడ్జెట్ లోనే పూర్తి చేస్తుంటాడు. గతేడాది మారుతి ప్రతిరోజూ పండగే సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు.

ఈ సినిమా తర్వాత వెంటనే మరో ప్రాజెక్ట్ ను లైన్లో పెట్టాలని భావించాడు ఈ దర్శకుడు. కాకపోతే అనుకోకుండా వచ్చిన కరోనా ప్రభావం కారణంగా మారుతి నెక్స్ట్ సినిమా వెనక్కి వెళుతూ వచ్చింది. అయితే ఇన్ని నెలల తర్వాత మళ్ళీ దీని గురించి మాట్లాడుకుంటున్నారు.

ముందు రవితేజతో ఈ సినిమా తీద్దామనుకుంటున్నాడు మారుతి. రవితేజకు ఈ సినిమా నచ్చింది కూడా. అయితే రెమ్యునరేషన్ పరంగా తేడా రావడంతో రవితేజ ఈ చిత్రం నుండి తప్పుకున్నాడు.

దీంతో ఈ ప్రాజెక్ట్ గోపీచంద్ చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. పక్కా కమర్షియల్ అనే ఆసక్తికర టైటిల్ ను కూడా కన్ఫర్మ్ చేసినట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది మొదట్లోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోందని సమాచారం. పక్కా కమర్షియల్ గురించి అధికారిక సమాచారం త్వరలో బయటకు వస్తుంది.