గౌతమ్ నంద కి “బెంగాల్ టైగర్” ఈ సారైనా వరిస్తుందా?


Gopichand new movie with Sampath Nadhi
Gopichand new movie with Sampath Nadhi

తెలుగు బాక్సాఫీస్ దగ్గర కొంచెంలో మిస్సయిన సినిమాలు ఉన్నాయి అందులో “గౌతమ్ నంద” ఒక్కటి. దర్శకుడు “సంపత్ నంది” గారు మంచి హిట్స్ సినిమా అయిన “బెంగాల్ టైగర్” తర్వాత చేసిన సినిమా. గౌతమ్ నంద సినిమా అంతా బాగుంది కానీ ఏదో కొంచెంలో మిస్ అయిన భావన అందరికి కలగటం, చివరగా ఈ సినిమాని బాక్సాఫీస్ దగ్గర నిలబెట్టలేక డీలా పడిపోయింది.

హీరోగా రెండు పాత్రలు చేసిన “గోపీచంద్” సినిమాకి పెట్టిన కష్టం వృధా అవ్వలేదు. అందుకే ఇంకొక సినిమాకి అవకాశం ఇచ్చాడు అని ఎప్పుడో పుకార్లు వచ్చాయి, మొత్తానికి అది ఇప్పుడు ముహూర్తం కుదిరింది.

నిజానికి ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి కానీ డేట్స్ దొరక లేదు, గోపీచంద్ గారు టైం ఇవ్వలేదు ఎందుకంటే “చాణక్య” సినిమా చేసే పనిలో ఉన్నారు. చాణక్య సినిమా ఇప్పుడు రిలీజ్ కి దగ్గర పడుతుంది. చాణక్య అయిపోయిందో లేదో మొన్ననే ఒక సినిమాకి ముహూర్తం మొదలు పెట్టాడు, అది వేరే దర్శకుడితో.

ఇలా సడెన్ గా మధ్యలో ఎప్పుడు కలిసారో ఏమోకానీ, మొత్తానికి సంపత్ నంది గారి సినిమా ఒకే అయ్యింది, అది కూడా ముహూర్తం జరుపుకుంది అని టాక్.