ఆ రిస్క్ చేయ‌లేనంటున్న హీరో?

Gopichand not interested to resume seetimaarr shoot
Gopichand not interested to resume seetimaarr shoot

క‌రోనా మ‌హ‌మ్మారి దేశ వ్యాప్తంగా భ‌యాన‌క వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తోంది. ఎక్క‌డ చూసినా, ఏ రాష్ట్ర గ‌ణాంకాలు విన్నా క‌రోనా కేసులు, క‌రోనా మ‌ర‌ణాలే. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా సెల‌బ్రిటీల‌ని సైతం క‌రనా వ‌ద‌ల‌డం లేదు. దీంతో చాలా మంది గ‌డ‌ప‌దాటి బ‌య‌టికి రావాలంటే గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నారు. సామాన్యులు మాత్రం ప‌ని దొర‌క్క‌, ఉపాది కోసం బ‌య‌ట తిరుగుతున్నారు. కానీ స్టార్స్ మాత్రం బ‌య‌టికి రావ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేదు.

ప‌రిస్థితి ఇలా వుంటే `సీటీమార్` టీమ్ ఆగ‌స్టు రెండ‌వ వారం నుంచి షూటింగ్ పునః ప్రారంభిస్తున్నామంటూ ప్ర‌క‌టించింది. ట‌మ్ అంతా సిద్ధంగా వుంద‌ని షూటింగ్ మొద‌లుపెడ‌తామ‌ని కాన్ఫిడెంట్‌గా వెల్ల‌డించింది. కానీ రియాలిటీ మాత్రం మ‌రోలా వుంది. చిత్ర బృందం ఇచ్చిన స్టేట్‌మెంట్ ప‌ట్ల హీరో గోపీచంద్ సుఉఖంగా లేర‌ని తెలిసింది. గోపీచంద్ హీరోగా సంప‌త్ నంది ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్నారు.

అ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్‌ని ఈ నెల రెండ‌వ వారం నుంచి ప్రారంభించాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేసింది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా విళ‌య‌తాండ‌వం చేస్తుండ‌గా రిస్క్ చేయ‌డం అవ‌స‌ర‌మా అని హీరో గోపీచంద్ భావిస్తున్నార‌ట‌. ఇప్పుడు రిస్క్ చేయ‌లేన‌ని, సినిమా కోసం త‌న పిల్ల‌ల‌ని ఇబ్బందుల‌కి గురిచేయ‌లేన‌ని గోపీచంద్ చిత్ర బృందానికి, ద‌ర్శ‌కుడు సంప‌త్ నందికి స్ప‌ష్టం చేసిన‌ట్టు ఇన్ సైడ్ టాక్‌.