గోపీచంద్ పంతం ప్రీమియర్ షో టాక్


gopichand pantham overseas talkగోపీచంద్ హీరోగా నటించిన పంతం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది . అయితే ఓవర్ సీస్ లో కాస్త ముందుగానే ఆటలు పడ్డాయి . ప్రీమియర్ షోల ప్రకారం పంతం టాక్ ఎలా ఉందో తెలుసా …… ….. సూపర్ హిట్ కాదు కానీ హిట్ రేంజ్ అయితే దక్కించుకుంది అని అంటున్నారు టాక్ ప్రకారం . అల్లరి చిల్లరిగా తిరుగుతూ తన మిత్రులతో కలిసి దొంగతనాలు చేసే హీరో ఒక సమయంలో హోమ్ మినిష్టర్ ఇంట్లోనే దొంగతనం చేస్తాడు . అసలు హీరో గ్యాంగ్ దొంగతనం చేయడం ఏంటి ? అది కూడా రాజకీయ నాయకుల ఇళ్లలో రాబరీ చేయడం ఎందుకు ? అసలు హీరో వృత్తి , ప్రవ్రుత్తి ఏంటి ? అన్నది మిగతా కథ .

యాక్షన్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ కి ప్రాధాన్యత ఇచ్చిన ఈ సినిమాలో కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలతో పాటు కొన్ని బోర్ కొట్టించే సన్నివేశాలు కూడా ఉన్నాయట మొత్తంగా సినిమా హిట్ స్థాయి ని అందుకునేలా ఉందని అంటున్నారు ఓవర్ సీస్ జనాలు . అయితే మంచి సందేశాన్ని ఇచ్చిన కథ అంటున్నారు గోపీచంద్ అభిమానులు . మొత్తానికి నాలుగేళ్లుగా గోపీచంద్ ఎదురు చూస్తున్న విజయం ఈసారి పంతం తో నెరవేరిందని అంటున్నారు .

చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కేకే రాధామోహన్ నిర్మించగా మెహరీన్ కౌర్ హీరోయిన్ గా నటించింది . ఓవర్ సీస్ టాక్ ఓకే ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలా స్పందిస్తారో ? ఎలాంటి విజయాన్ని ఇస్తారో కొద్దీ గంటల్లోనే తేలిపోనుంది .