సైరాతో పోటీపై గోపిచంద్ స్పందనేంటి?

Chiranjeevi And Gopichand
సైరాతో పోటీపై గోపిచంద్ స్పందనేంటి?

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి ఈ అక్టోబర్ 2న విడుదలవుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా విడుదలకు మూడు రోజుల తర్వాత అంటే అక్టోబర్ 5న గోపిచంద్ హీరోగా నటించిన చాణక్య వస్తోంది. చిరంజీవి సినిమా వస్తున్నప్పుడు దానికి పోటీగా మరో సినిమా విడుదలవ్వడం ఏంటని పలువురు అభిప్రాయపడినా దీనిని పోటీగా భవించకూడదని గోపిచంద్ అంటున్నాడు.

అసలు తన సినిమా చిరంజీవి చిత్రానికి పోటీనే కాదని, దసరాకి రెండు, మూడు సినిమాలు విడుదలయ్యే స్కోప్ ఉంటుందని గోపీచంద్ గుర్తుచేసాడు. నిజానికి చాణక్య ఎప్పుడో విడుదలవ్వాలి. కానీ గోపిచంద్ కు అయిన గాయం కారణంగా చాణక్య లేట్ అవుతూ వచ్చి చివరికి దసరాకి విడుదల కాబోతోంది.

ఇదిలా ఉంటే మరోవైపు చాణక్య చిత్రానికి థియేటర్లు కేటాయించకూడదని ఒక వర్గం నుండి తీవ్ర ఒత్తిడి వస్తోందని వార్తలు వస్తున్నాయి. మరి వీటిలో నిజానిజాలేంటో తెలియలేదు.