సైరాకు చాణక్య ఎందుకు పోటీ కాదంటే..?

సైరాకు చాణక్య ఎందుకు పోటీ కాదంటే..?
సైరాకు చాణక్య ఎందుకు పోటీ కాదంటే..?

యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ చాణక్య అన్ని అడ్డంకులు అధిగమించి రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైపోయింది. ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం ఎలా ఉంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే చాణక్య ఇప్పుడు విపరీతమైన పోటీ మధ్య విడుదలవుతున్న సంగతి మర్చిపోకూడదు.

చిరంజీవి సైరా చిత్రానికి ఇప్పుడు ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. దసరా సెలవుల్లో కచ్చితంగా ఫస్ట్ ఛాయస్ సైరానే అవుతుంది. మరోవైపు వార్, జోకర్ చిత్రాలకు కూడా మంచి రెస్పాన్స్ ఉంది. A సెంటర్ ప్రేక్షకులు సైరా తర్వాత ఇచ్చే ప్రిఫరెన్స్ వీటికే. మరి ఇంత పోటీని తట్టుకుని చాణక్య ఎలా నిలబడతాడో అన్నది చూడాలి.

ఇక సైరాకు పోటీగా విడుదల చేయడంపై గోపీచంద్ భిన్నమైన వాదనను వినిపిస్తున్నాడు. మొదట చాణక్య మే నెలలో విడుదల కావాల్సి ఉంది. అయితే గోపీచంద్ కు అయిన గాయం కారణంగా షూటింగ్ డిలే అవడంతో అక్టోబర్ 3న విడుదల చేయాలనుకున్నారు. అప్పటికి ఇంకా సైరా విడుదల తేదీ ప్రకటించలేదు. తర్వాత సైరా అక్టోబర్ 2న ప్రకటించారు. దాంతో మాకు గత్యంతరం లేక అక్టోబర్ 5న విడుదలకు వస్తున్నాం. కాబట్టి తాము సైరాకి పోటీగా వెళ్ళలేదు అని గోపీచంద్ స్పష్టం చేసాడు.