దారుణం ఇది మహా దారుణం

Gopichand Situation was Too Deep Position
Gopichand Situation was Too Deep Position

ఒక తెలుగు హీరోకి మార్కెటింగ్ తగ్గిపోతే రాబోయే సినిమాలు ఆపేస్తారా ? మరి చెయ్యక  తప్పదు…..లేదంటే మా నిర్మాణ సంస్థ అన్ని సర్దేసుకుని ఇంటికి పోవాల్సిందే అంటున్నారు ఆ నిర్మాతలు. మరి హీరో గోపీచంద్ తొట్టెంపూడి ఇవన్నీ తట్టుకొని నిలబడతాడా అంటే నమ్మకం తక్కువే ఎందుకంటే ఆ పరిస్థితి వచ్చింది గోపీచంద్ గారికి అని మీకు అర్ధం అయిపోయినట్లే కదా…

అవును గత సంవత్సరం విడుదల అయిన తన 25 వ సినిమా ‘పంతం‘ ఒక మాదిరి ప్రేక్షకులని అలరించగా విమర్శకుల దృష్టికి వెళ్లలేక ఇంటికి తిరుగుపయనం అయ్యింది. పంతం సినిమాకి ముందు వరుసగా 4 సినిమాలు అట్టర్ ఫ్లాపులు అయ్యాయి. అసలు రెండు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయితేనే జనాలు వారిని మరిచిపోయే ఈ రోజుల్లో గోపీచంద్ గారికి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయంటే జనాలకి తన నటన మీద ఇంకా ఆసక్తి ఉంది అని చెప్పవచ్చు.

ఇక దసరా కానుకగా విడుదల అయిన ‘చాణక్య’ సినిమా హీరో గోపీచంద్ కెరీర్ లో ఇంకొక అట్టర్ ఫ్లాప్ గా నిలిచిపోయింది. ఆ సినిమా  చేసినందుకు హీరో గోపీచంద్ మీద ప్రభావం గట్టిగా పడింది. నిర్మాతలు అయిన అనిల్ సుంకర గారికి కనీసం బెంచ్ మార్క్ డబ్బులు కూడా రాలేదు. ఇక గోపీచంద్ గారి మార్కెటింగ్ ని గమనించిన నిర్మాత ఒకలు తర్వాత చేయబోయే సినిమాని కాన్సల్ చేసుకున్నారు. ఆ నిర్మాత ఎవరో కాదు ‘బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్’ గారు.

చాణక్య సినిమా విడుదలకి ముందు గోపీచంద్ గారు బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ తో ఒక సినిమాని పూజ కార్యక్రమాలు కూడా చేసుకుంది. అయితే చాణక్య సినిమా తర్వాత గోపీచంద్ గారిని దూరం పెట్టిన మీడియా ఇక తన సినిమాకి కూడా అలానే జరుగుతుంది అని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ గారు సినిమా నుండి తప్పుకున్నారని, ఆ సినిమాని ఇంకొక హీరోతో చెయ్యాలని అనుకుంటున్నారని మీడియా లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఆ విషయాలన్నీ త్వరలోనే మీడియా ముందుకి బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ గారు చెప్పబోతున్నారని వినికిడి.

ఇక గోపీచంద్ గారి చేతిలో ‘సంపత్ నంది’ సినిమా ఒక్కటి మాత్రమే ఉంది. ఇక అది కూడా కాన్సల్ అయ్యేలా ఉంది ఎందుకంటే హీరో గోపీచంద్ గారు ఫ్లాపు బాటలో ఉన్నారు, దర్శకులు సంపత్ నంది గారు కూడా ఫ్లాపులొనే ఉన్నారు. నిర్మాతలు ఇదే విషయం మీద తెగ ఆలోచిస్తున్నారు అని సినిమా యూనిట్ వాళ్ళు అనుకుంటున్నారు. సినిమాలో కథానాయికగా చేస్తున్న ఒక్క తమన్నా గారి మీదనే పూర్తి నమ్మకంగా ఉన్నారు నిర్మాతలు. ఒకవేళ ఈ సినిమాలో కూడా గోపీచంద్ గారు నటించినా, నటించకపోయినా కథానాయిక మాత్రం తమన్నా అని అనుకుంటున్నారు.

ఈ విషయం తెలుసుకున్న గోపీచంద్ గారి అభిమానులు నిర్మాతలని దూషిస్తూ మా హీరో గోపీచంద్ గారికి అన్యాయం చేస్తున్నారు ఇది మరి దారుణం అని అనుకుంటున్నారు. అందుకే సినిమాల విషయంలో చేసింది పద్దతిగా చేసుకోవాలి అని గోపీచంద్ గారి పరిస్థితి తెలిసిన మిగిలిన వారు అనుకుంటున్నారు. ఇక గోపీచంద్ గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూద్దాం.