సమ్మర్ బరిలో “సీటీమార్”


సమ్మర్ బరిలో “సీటీమార్”
సమ్మర్ బరిలో “సీటీమార్”

మాచో స్టార్ గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా, డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కిస్తున్న సినిమా “సీటీమార్” ఈ సినిమాలో గోపీచంద్ ఒక జాతీయస్థాయి కబడ్డీ ప్లేయర్ గా, మరియు ఒక గ్రామీణ బాలికల జట్టు కోచ్ గా నటిస్తున్నారు. హిప్పీ ఫేం దిగంగాన మరో హీరోయిన్. సమంత కథానాయిక గా “యూ టర్న్” లాంటి విభిన్నమైన సినిమా మనకు అందించిన శ్రీనివాస్ చిట్టూరి గారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

హైదరాబాద్, రాజమండ్రి ప్రాంతాలలో సినిమా షూటింగ్ జరుగుతోంది. స్వరబ్రహ్మ మణిశర్మ గారు ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా, ప్రభాస్ తో బిల్లా లాంటి స్టైలిష్ సినిమాలకు వర్క్ చేసిన సౌందర్ రాజన్ ఈ మూవీకి సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఇప్పటికే గోపీచంద్ తో ఆయన సాహసం లాంటి సినిమాలతో పాటు, గోపిచంద్, సంపత్ నంది కాంబినేషన్ లో “గౌతంనంద” లాంటి హిట్ మూవీస్ కు పనిచేసారు. సీటిమార్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ, చిత్ర యూనిట్ ఈ సినిమా సమ్మర్ కు రిలీజ్ ఉంటుందని అనౌన్స్ చేసింది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.