సీటీమార్‌: మైదానంలో ఆడితే ఆట‌..బైట ఆడితే వేట‌!

 

Gopichands seetimaarr teaser out
Gopichands seetimaarr teaser out

గోపీచంద్ హీరోగా న‌టిస్తున్న స్పోర్ట్స్ డ్రామా `సీటీమార్‌`. సంప‌త్‌నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. క‌బ‌డ్డీ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ందులో హీరో గోపీచంద్‌, త‌మ‌న్నా క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌లుగా క‌నిపించ‌నున్నారు. గోపీచంద్ ఆంధ్రా టీమ్‌కి కోచ్‌గా, త‌మ‌న్నా తెలంగాణ టీమ్‌కి కోచ్‌గా న‌టిస్తున్నారు.

ఇందులో త‌మ‌న్నా ప‌క్క తెలంగాణ అమ్మాయిగా క‌నిపించ‌బోతోంది. సిల్వ‌ర్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై శ్రీ‌నివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ టీజ‌ర్‌ని సోమ‌వారం చిత్ర బృందం రిలీజ్ చేసింది. కార్తిగా గోపీచంద్‌,  జ్వాలారెడ్డిగా త‌మ‌న్నా క‌నిపించ‌నున్నారు. తాజ‌గా రిలీజ్ చేసిన టీజ‌ర్ ఆక‌ట్టుకుంటోంది. భూమిక మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.

`క‌బ‌డ్డీ మైదానంలో ఆడితే ఆట‌.. బ‌య‌ట ఆడితే వేట‌` అంటూ గోపీచంద్ చెబుతున్న డైలాగ్‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. మాస్ విజిల్స్ వేసే యాక్ష‌న్ ఘ‌ట్టాలు… చివ‌ర్లో గోపీచంద్ సీటీకొడుతున్నతీరు చూస్తుంటే నిజంగానే ప్రేక్ష‌కుల చేత ఈ మూవీ సీటీకొట్టించేలా వుంది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ మూవీ ఏప్రిల్ 2న విడుద‌ల కాబోతోంది.