సాయి పల్లవి కి ఆ డైరెక్టర్ కు మధ్య లవ్వా ?


Gossip on AL vijay and Sai pallavi

ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన మలయాళ భామ సాయి పల్లవి . అయితే తనకు ప్రేమ వివాహాలపై నమ్మకం లేదని , తల్లిదండ్రులను వదిలేసి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని డైలాగ్స్ పేల్చే సాయి పల్లవి మీద ఊహించని రీతిలో కథనాలు వస్తున్నాయి తమిళనాట . తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ తో సాయి పల్లవి ప్రేమలో ఉందని త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమని ఆ కథనాల సారాంశం .

 

ఏ ఎల్ విజయ్ హీరోయిన్ అమలా పాల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . కట్ చేస్తే సంవత్సరం పూర్తి కాకముందే విబేధాలు వచ్చాయి దాంతో విడాకులు తీసుకున్నారు . ఇంకా మరో పెళ్లి చేసుకోలేదు అయితే ఇప్పుడు ఏ ఎల్ విజయ్ – సాయి పల్లవి ల పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి . ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో సాయి పల్లవి తమిళనాట ఓ చిత్రంలో నటించింది . కాగా ఆ తమిళ సినిమా తెలుగులో కణం గా రిలీజ్ అయ్యింది ప్లాప్ అయ్యింది కూడా . అప్పటి నుండి ఇద్దరి మధ్య ఏదో ఉందని క్రమంగా అది ప్రేమగా మారిందని అంటున్నారు . నిజమా ? కాదా ? అన్నది తెలియాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే మరి .

English Title : Gossip on AL vijay and Sai pallavi

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

 


Rashmika mandanna reacts on lip lock with vijay devarakondaHot diva Tabu in allu arjun -Trivikram's filmSuper offer for Vijay Devarakonda's Dear Comrade in NizamManchu manoj comments on jr. ntr political entry