`ఆహా`కు అంత మంది ఆద‌ర‌ణ వుందా?


Grand launch of aha will take place on March 25th
Grand launch of aha will take place on March 25th

అమెరిక‌న్ డిజిట‌ల్ ప్లాట్ ఫామ్స్ నెట్‌ఫ్లిక్స్, అమెజార్ ప్రైమ్‌, ఇండియాలో ముఖ్యంగా ఉత్త‌రాదికి చెందిన జీ5, ఆల్ట్ బాలాజీ వంటి ఓటీటీలు ద‌క్షిణాది మార్కెట్‌ని ఆక్ర‌మించేస్తున్నాయి. అలా జ‌ర‌క్కూడద‌ని భావించిన ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ తాజాగా `ఆహా` పేరుతో ఓ డిజిట్ ప్లాట్ ఫామ్‌ని ప్రారంభించిన విష‌యం తెలిసిందే.

దీని ద్వారా లోక‌ల్ కంటెంట్‌ని ప్ర‌పంచ వ్యాప్తంగా వున్న తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించాల‌ని ప్లాన్ చేశారు. వంద శాతం తెలుగు వెబ్ సిరీస్‌ల‌తో పాటు తెలుగు సినిమాల్ని ఈ ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందుబాటులోకి తీసుకొచ్చారు. విజ‌య్ దేవ‌ర‌కొండ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్యవ‌హ‌రిస్తున్న `ఆహా` ఓటీటీ ప్రివ్యూని ఫిబ్ర‌వ‌రి 8న ఏర్పాటు చేసి `ఆహా`ని మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే.

ఇటీవ‌ల ప్రారంభంమైన ఈ ఓటీటీకి కేవ‌లం రెండు వారాల్లోనే అనూహ్య ఆద‌ర‌ణ ల‌భించింది. ఐదు ల‌క్ష‌ల రిజిస్ట్రేష‌న్‌లు న‌మోదు కావ‌డం విశేషంగా చెబుతున్నారు. ఇప్ప‌టికే 671000 రిజిస్ట్రేష‌న్స్ దాటిన‌ట్టు తెలుస్తోంది. `ఆహా`లో `కొత్త పోర‌డు, మ‌స్తీస్‌, షిట్ హెపెన్స్‌, గీతా సుబ్ర‌మ‌ణ్యం, వంటి వెబ్ సిరీస్‌లు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ యాప్‌ని ఈ నెల 25న ఉగాది సంద‌ర్భంగా భారీ స్థాయిలో లాంచ్ చేయ‌బోతున్నారు. ఈ ఈ వెంట్‌లో ఇండ‌స్ట్రీకి సంబంధించిన సెల‌బ్రిటీలంతా పాల్గొంటార‌ని తెలిసింది.