అఖిల్‌ని ఫిదా చేసిన బుట్ట‌బొమ్మ‌!

అఖిల్‌ని ఫిదా చేసిన బుట్ట‌బొమ్మ‌!
అఖిల్‌ని ఫిదా చేసిన బుట్ట‌బొమ్మ‌!

అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌`. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ దర్శ‌కుడు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై యువ నిర్మాత బ‌న్నీవాసు మ‌రో నిర్మాత వాసు వ‌ర్మ‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ మూవీ నుంచి వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేసింది.

గోపీ సుంద‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని `గుచ్చే గులాబీలాగా నా గుండె లోతునే తాకిన‌దే..` అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని మేక‌ర్స్ శ‌నివారం విడుద‌ల చేశారు. ఇప్ప‌టికే విడుద‌లైన `మ‌న‌సా మ‌న‌సా ` పాట ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్న నేప‌థ్యంలో తాజాగా విడుద‌లైన పాట ప్రేక్ష‌క హృద‌యాల్ని హ‌త్తుకుంటోంది. ఈ పాట‌లో పూజా హెగ్డే అందాన్ని చూసి హీరో అఖిల్ ఫిదా అయిపోయారు. ఈ సంద‌ర్భంలోనే ఈ పాట రానుంద‌ట‌.

రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ మూవీపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇటీవ‌ల విడుద‌లై పాట‌లు ఆ అంచ‌నాల్ని మ‌రో స్థాయికి తీసుకెళుతున్నాయి. విభిన్న‌మైన ప్రేమ‌క‌థ‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి జూన్ 19న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌బోతున్నారు.