నాగార్జున మూవీలో బాలీవుడ్ భామ‌!

నాగార్జున మూవీలో బాలీవుడ్ భామ‌!
నాగార్జున మూవీలో బాలీవుడ్ భామ‌!

‘డోర్’, ‘టర్నింగ్ 30’ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది మాజీ మిస్ ఇండియా గుల్ పనాగ్. ప్ర‌స్తుతం బాలీవుడ్ చిత్రాల‌తో పాటు ప‌లు పాపుల‌ర్ వెబ్ సిరీస్‌ల‌లో న‌టిస్తంది. ఇటీవ‌ల హీరోయిన్ అనుష్క శ‌ర్మ నిర్మించిన పాపుల‌ర్ వెబ్‌సిరీస్ `పాథాల్‌లోక్‌`లోనూ గుల్ ప‌నాగ్ కీలక పాత్ర‌లో గృహిణిగా న‌టించి ఆక‌ట్టుకుంది. ఆమె త్వ‌ర‌లో తెలుగులో అరంగేట్రం చేయబోతున్నారు.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ఓ భారీ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలోని ఓ కీల‌క పాత్ర‌లో గుల్ ప‌నాగ్ నటించనున్నారు. ఆమె ఈ చిత్రంలో నాగార్జునకు సోదరిగా కనిపించే అవకాశం ఉందని తెలిసింది. ఈ సినిమా దేశానికి సంబంధించిన పన్నులు చెల్లింపు, ప్రజల డబ్బును సక్రమంగా వినియోగించ‌డం వంటి వాస్తవ సమస్యల ఆధారంగా తెర‌కెక్కించ‌నున్నార‌ట‌.

నాగార్జున, ప్ర‌వీణ్ సత్తారుల క‌ల‌యిక‌లో రానున్న ఈ చిత్రం బాలీవుడ్ హిట్ చిత్రం ‘రైడ్’ కి రీమేక్ అని తెలుస్తోంది. అయితే ప్ర‌వీణ్ స‌త్తారు మాత్రం ఒరిజినల్ స్క్రిప్ట్‌తో చేస్తున్నామ‌ని చెబుతున్నారు. ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ఫిబ్రవరి 22 నుండి హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతోంది. ఏషియ‌న్ సినిమాస్ అధినేత నారాయణదాస్ కె నారంగ్ ఈ ప్రాజెక్టును నిర్మించ‌నున్నారు.