ఎన్ని బ్లాక్ బస్టర్ లు వచ్చినా గుణ 369 స్పెషల్ : కార్తికేయ


Guna 369 is My all-time favorite Says Karthikeya
Guna 369 is My all-time favorite Says Karthikeya

నాకు ఎన్ని బ్లాక్ బస్టర్ లు వచ్చినా గుణ 369 సినిమా ఇచ్చిన సంతృప్తి , కాన్ఫిడెన్స్ ఏ సినిమా ఇవ్వదని అంటున్నాడు యంగ్ హీరో కార్తికేయ .

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలనం సృష్టించిన కార్తికేయ రెండో చిత్రం హిప్పీ తో డిజాస్టర్ అందుకున్నాడు .

అయితే బోయపాటి శ్రీను శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో మూడో సినిమాగా గుణ 369 చిత్రం చేసాడు . ఆగస్టు 2 న విడుదలైన గుణ 369 విడుదలైన అన్ని చోట్లా మంచి వసూళ్ళని సాధిస్తోంది .

దాంతో ప్రేక్షకులను కలవడానికి పలు థియేటర్ లకు వెళ్లిన సందర్బంగా పలువురు మహిళలు కార్తికేయ ని గట్టిగా హత్తుకొని మంచి సినిమా చేసారు , అని అభినందించడమే కాకుండా మేము చేయలేని పని సినిమాలో చేసి చూపించావు అంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యారట . వాళ్ళు చూపిన ప్రేమ , గౌరవం ఎన్ని సినిమాలు చేసినా …… ఎన్ని బ్లాక్ బస్టర్ లు ఇచ్చినా రాదని తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు కార్తికేయ .