గుణ 369 ట్రైలర్ టాక్


Guna369 Theatrical Trailer
Guna369 Theatrical Trailer

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో కార్తికేయ తన రెండో చిత్రం డిజాస్టర్ అందుకున్నాడు . ఇక ఇప్పుడేమో ముచ్చటగా మూడో చిత్రంగా గుణ 369 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు కార్తికేయ . ఈరోజు గుణ 369 ట్రైలర్ విడుదల చేసారు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ దర్శకుడు బోయపాటి శ్రీను . ఇక ట్రైలర్ అచ్చం బోయపాటి సినిమాని తలపించింది ఎందుకంటే ఇది బోయపాటి శ్రీను శిష్యుడి సినిమా కాబట్టి .

జంధ్యాల అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లో అనగ హీరోయిన్ గా నటించింది . సాహో చిత్రం విడుదల వాయిదాపడటంతో గుణ 369 చిత్రాన్ని ఆగస్టు 2 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . లవ్ , యాక్షన్ ఎలిమెంట్స్ తో గుణ 369 చిత్రాన్ని రూపొందించారు . గుణ 369 తప్పకుండా హిట్ అవుతుందన్న ఆశాభావంతో ఉన్నాడు కార్తికేయ .