గుణ‌శేఖ‌ర్ శ‌కుంత‌ల ఎవ‌రు?

గుణ‌శేఖ‌ర్ శ‌కుంత‌ల ఎవ‌రు?
గుణ‌శేఖ‌ర్ శ‌కుంత‌ల ఎవ‌రు?

టాలీవుడ్‌లో పాన్ ఇండియా చిత్రాలు స్పీడందుకున్నాయి. ఇప్పుడు సెట్‌పై ఐదారు చిత్రాలు వున్నాయి. ఈ కోవ‌లో ప్ర‌ధ‌మంగా వినిపిస్తున్న పేరు `హిర‌ణ్య‌క‌శ్య‌ప‌`. గుణ‌శేఖ‌ర్ ఈ మైథ‌లాజిక‌ల్ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రానా ప్ర‌ధాన పాత్ర‌లో ఈ మూవీని తెర‌పైకి తీసుకురావాల‌ని గ‌త నాలుగైదేళ్లుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అమెరికాలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది.

క‌రోనా వైర‌స్ స్వైర విహారం చేస్తున్నా `హిర‌ణ్య‌క‌శిప‌` ప్రీప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్త‌యింద‌ని ప్ర‌క‌టించిన గుణ‌శేఖ‌ర్ దీన్ని లార్జ్ స్కేల్‌లో నిర్మించాలి కాబ‌ట్టి మ‌రింత స‌మ‌యం కావాలని, ఈ మ‌ధ్య‌లో కొత్త చిత్రాన్ని చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అన్న‌ట్టుగాను శుక్ర‌వారం కొత్త సినిమా అప్‌డేట్‌ని అందించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందించ‌బోతున్న `హిర‌ణ్య క‌శిప‌` చిత్రానికి ముందు `శాకుంత‌లం` పేరుతో ఓ ప్రేమ‌క‌థా చిత్రాన్ని తెర‌పైకి తీసుకురాబోతున్నానని ప్ర‌క‌టించారు.

దీనికి సంబంధించిన టైటిల్‌తో పాటు టీజ‌ర్‌ని కూడా రిలీజ్ చేశారు. వెండితెరపై ‘హిరణ్యకశ్యప’లో నరసింహావతారాన్ని సాక్షాత్కరింపజేసే ముందు … భారతాన ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథని ఆవిష్కరిస్తూ ఈ మూవీని చేయ‌బోతున్నాన‌ని గుణ‌శేఖ‌ర్  ప్ర‌క‌టించారు.  టీజ‌ర్‌కు స్వ‌ర బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు. న‌టీన‌టులెవ‌ర‌న్న‌ది మాత్రం వెల్ల‌డించ‌లేదు.