`శా‌కుంత‌లం` రోలింగ్‌కి డేట్ ఫిక్స్‌!

`శా‌కుంత‌లం` రోలింగ్‌కి డేట్ ఫిక్స్‌!
`శా‌కుంత‌లం` రోలింగ్‌కి డేట్ ఫిక్స్‌!

భారీ సెట్టింగుల ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న గుణ‌శేఖ‌ర్ కొంత విరామం త‌రువాత `శాకుంత‌లం` అనే ప్రేమ కావ్యాన్ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఇప్ప‌టికే మొద‌లైంది. `ఒక్క‌డు` కోసం చార్మినార్ సెట్‌ని రూపొందించి ఆడియ‌న్స్‌కి చిన్న డౌట్ కూడా రాకుండా నిజ‌మైన చార్మినారే చూస్తున్నామ‌న్న అనుభూతిని క‌లిగించిన ఆర్ట్ డైరెక్ట‌ర్ అశోక్ ఈ చిత్రానికి భారీ సెట్‌ల‌ని రూపొందిస్తున్నారు.

ఇప్ప‌టికే సెట్‌ల నిర్మాణం మొద‌లైంది. త్వ‌ర‌లో షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. ఇందులో శకుంత‌ల‌గా టైటిల్ పాత్ర‌లో స్టార్ హీరోయిన్ స‌మంత క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ మార్చి 20 నుంచి ప్రారంభం కాబోతోంది. చారిత్ర‌క చిత్రం `రుద్ర‌మ‌దేవి` త‌రువాత గుణ‌శేఖ‌ర్ చేస్తున్న మూవీ కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెకొన్నాయి.

మైథ‌లాజిక‌ల్ ఫిల్మ్ గా అత్యంత భారీ స్థాయిలో నిర్మించ‌నున్న ఈ చిత్రానికి దిల్ రాజు ఫైనాన్స్ చేస్తున్నార‌ట‌. పైకి మాత్రం గుణ టీమ్ వ‌ర్క్స్ కానీ తెర వెనుక మాత్రం ఈ భారీ ప్రాజెక్ట్‌కు నిర్మాత దిల్ రాజే అని తెలిసింది.