25 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న `సొగ‌సుచూడ‌త‌ర‌మా`!


25 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న `సొగ‌సుచూడ‌త‌ర‌మా`!
25 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న `సొగ‌సుచూడ‌త‌ర‌మా`!

లాఠీ, మ‌నోహ‌రం, ఒక్క‌డు, రుద్రమదేవి వంటి చిత్రాల‌తో సంచ‌ల‌న విజ‌యాల్ని సొంతం చేసుకున్నారు ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్‌. ప్ర‌స్తుతం మైథ‌లాజిక‌ల్ క‌థాంశం నేప‌థ్యంలో ప్రెస్టీజియ‌ల్ పాన్ ఇండియా ఫిల్మ్‌గా `హిర‌ణ్య‌క‌శ్య‌ప‌`ని త్వ‌ర‌లో ప్రారంభించ‌బోతున్నారు. ఓ హాలీవుడ్ సంస్థ‌తో క‌లిసి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతోంది. రానా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్ర ప్రీప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్త‌యింది. క‌రోనా క్రైసిస్ పూర్త‌యిన వెంట‌నే ఈ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నారు.

ఇదిలా వుంటే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌గా గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కించిన చిత్రం `సొగ‌సు చూడ‌త‌ర‌మా`. న‌రేష్‌, ఇంద్ర‌జ జంట‌గా న‌టించారు. ఈ చిత్రం విడుద‌లై ఈ నెల 14తో 25 ఏళ్లు పూర్తి కానుంది. అప్ప‌ట్లో సెన్సేష‌న‌ల్ హిట్ కావ‌డ‌మే కాకుండా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన నాలుగు నంది అవార్డుల‌ని ద‌క్కించుకుంది. ఉత్త‌మ చిత్రంగా, ఉత్త‌మ స్క్రీన్‌ప్లే రైట‌ర్ా గుణ్‌శేఖ‌ర్‌కు, ఉత్త‌మ డైలాగ్ రైట‌ర్‌గా అజ‌య్ శాంతికి, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా కుమార్ అవార్డుల్ని ద‌క్కించుకున్నారు.

`సొగ‌సు చూడ‌త‌ర‌మా` చిన్న చిత్రంగా నిర్మించినా ప్రేక్ష‌కులు పెద్ద విజ‌యాన్ని అందించ‌డ‌మే కాకుండా ఉత్త‌మ చిత్రంగా బంగారు నంది రావ‌డం, బెస్ట్ స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా నాకు, బెస్ట్ డైలాగ్ రైట‌ర్‌గా అజ‌య్ శాంతికి, కాస్ట్యూమ్ డిజైన‌ర్ కుమార్‌కు నంది పుర‌స్కారం ద‌క్క‌డం ఆనందాన్ని క‌లిగించింది. ప్రేక్ష‌కుల రివార్డ్స్‌ను ప్ర‌భుత్వ అవార్డ్స్‌ను అందుకుని నా సినీ జీవితంలో అన్ని విధాలా సంతృప్తిని క‌లిగించింది. స్వీట్ మెమ‌రీగా నిలిచిన `సొగ‌సు చూడ‌త‌ర‌మా` 25 వ‌సంతాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఆద‌రించిన ప్రేక్ష‌కుల‌కు, అవార్డులిచ్చి గౌర‌వించిన ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు` అన్నారు గుణ‌శేఖ‌ర్‌.