పవన్ కళ్యాణ్ పై షాకింగ్ ట్వీట్ చేసిన మహేష్ బావ


guntur mp galla jayadev shocking tweets on pawan kalyanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై షాకింగ్ ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు మహేష్ బాబు బావ గుంటూరు పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ . పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కి మద్దతు ఇచ్చాడు కానీ గత ఆరునెలలు గా తెలుగుదేశం పార్టీ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంతేకాదు చంద్రబాబు పైనా అలాగే నారా లోకేష్ పైన కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేసాడు . తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేస్తూ పార్లమెంట్ సభ్యులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసాడు పవన్ దాంతో తాజాగా గల్లా జయదేవ్ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డాడు .

త్వరలోనే ముగ్గురు మిత్రులు అనే సినిమా రిలీజ్ కాబోతోంది అంటూ పవన్ కళ్యాణ్ , వై ఎస్ జగన్ , ప్రధాని మోడీ లను ఉద్దేశించి చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది . కేంద్ర ప్రభుత్వం పై గల్లా జయదేవ్ విరుచుకుపడిన తీరుకి , పార్లమెంట్ లో గల్లా జయదేవ్ డైలాగ్స్ డైనమైట్ లా పేలడంతో గల్లా జయదేవ్ కి ఊహించని విధంగా క్రేజ్ ఏర్పడింది . ఇక ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసి మరింత రచ్చ చేసాడు . జగన్ పార్టీ అవినీతిమయం అని ఆరోపించిన పవన్ , భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇప్పుడు అదే జగన్ తో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారంటూ ఘాటు విమర్శలు చేసాడు గల్లా జయదేవ్ .