గుత్తా జ్వాలా మాజీ ప్రియుడు ఆంటీని పట్టాడు


Gutta jwala ex lover harshavardhan with kim sharmaబ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా మాజీ ప్రియుడు నటుడు హర్షవర్ధన్ తాజాగా బాలీవుడ్ ఆంటీ కిమ్ శర్మ తో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ లో కథనాలు వస్తున్నాయి . తాజాగా హర్షవర్ధన్ – కిమ్ శర్మ ఇద్దరు కూడా ఓ మల్టీప్లెక్స్ వద్ద కనిపించేసరికి జోరుగా కథనాలు వండి వార్చారు . అయితే ఇద్దరి మధ్య ఏదో ఉందని పెద్ద ఎత్తున కథనాలు రావడంతో మేమిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే ! అని సెలవిచ్చారు . ఇది కామనే కదా ! చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంటారు , డేటింగ్ లో ఉన్నారా ? అంటే లేదు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెబుతారు . తీరా ఎప్పుడో బ్రేకప్ అంటారు కాలం మహిమ .

కిమ్ శర్మ తెలుగులో పలు చిత్రాల్లో నటించింది , ఐటెం గర్ల్ గా హీరోయిన్ గా అయితే తెలుగులో స్టార్ కాలేకపోయింది .క్రికెటర్ యువరాజ్ సింగ్ తో జోరుగా ప్రేమాయణం సాగించి కెన్యా బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకుంది అయితే అతడితో వచ్చిన విభేదాలతో అతడ్ని వదిలేసి ముంబై కు చేరుకుంది కట్ చేస్తే ఇప్పుడు హర్షవర్ధన్ తో ప్రేమాయణం సాగిస్తోంది . ఇక హర్షవర్ధన్ తక్కుడేమి కాదు ఇంతకుముందు బ్యాడ్మింటన్ గుత్తా జ్వాలా ని ప్రేమించి ఆమెతో ప్రేమాయణం సాగించాడు ఆతర్వాత ఆమెకు హ్యాండ్ ఇచ్చాడు . అంతకుముందే గౌహర్ ఖాన్ తో కూడా డేటింగ్ చేసాడు . ఇక ఇప్పుడేమో కిమ్ శర్మ తో డేటింగ్ లో ఉన్నాడు గుత్తా జ్వాలా మాజీ ప్రియుడు .

English Title: Gutta jwala ex lover harshavardhan with kim sharma