“నా బూ* ని  బాగా మిస్ అవుతున్నా..!” – గుత్తా జ్వాల


Gutta Jwala missing her boyfriend Vishnu Vishal
Gutta Jwala missing her boyfriend Vishnu Vishal

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి 21 రోజులపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలందరినీ ఇంటి వద్దనే ఉండాలని, స్వీయ నిర్బంధం పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సామాజిక దూరం కూడా పాటించాలని ఆదేశించిన నేపథ్యంలో ఎక్కువ శాతం ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు.ఇక ఇంటికే పరిమితమైన వాళ్ళలో కొంత మంది సెలబ్రెటీలు ఏదో ఒక హాబీ పాటిస్తూ లేదా ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్డేట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటే.. కొంతమంది మాత్రం ఇప్పటికి కూడా ఇంకా అదే పాత పులిహార వ్యవహారాలు నడుపుతున్నారు.

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల మరియు తమిళ హీరో విష్ణు విశాల్ ఇద్దరు రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం రేపుతున్న నేపథ్యంలో అందరూ ఎవరింటికి వాళ్లు పరిమితమయ్యారు. హీరో విష్ణు ఇప్పుడు చెన్నైలో ఉన్నారు. అయితే ఇప్పుడు  గుత్తా జ్వాల తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. విష్ణు విశాల్ ను బాగా మిస్ అవుతున్నానంటూ ఆమె పెట్టిన పోస్ట్ కు నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.

 “మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం ఉంటే.. ఫోన్ లో పర్సనల్ మెసేజ్ లు చేసుకోండి.. అంతే తప్ప ఇలా సోషల్ మీడియాలో రచ్చ చేయడం అవసరమా..” అని తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.

నిజానికి ఒక వ్యక్తి అంటే మనకు ఇష్టం ఉండటం తప్పు కాదు. ఆ విషయాన్ని ఆ వ్యక్తితో పంచుకోవడం తప్పుకాదు. ఆ వ్యక్తి మనకి దూరంగా ఉంటున్న నేపథ్యంలో మనకి ఎడబాటుతో బాధ అనిపించడం కూడా తప్పు కాదు. కానీ మన బాధను మన భావోద్వేగాన్ని సదరు వ్యక్తితో వ్యక్తిగతంగా పంచుకోవాలి తప్ప; ఇలా “రచ్చకెక్కి పదిమంది నోళ్లల్లో నానాలి..!” అనుకునే ఐడియాలజీ మంచిది కాదు

ఒక రంగంలో ఎంతో కొంత పరిణితి సాధించి; అవార్డులు కూడా గెలుచుకుని, పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన మనుషులు ఇలా చులకనగా ప్రవర్తించడం సరికాదని గుత్తాజ్వాల ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి.