అల్లు అర్జున్ డైలాగులు చెబుతోన్న హన్సికhansika about her busy schedule
hansika about her busy schedule

పాల బుగ్గల సుందరి హన్సిక గుర్తుందా? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హన్సిక, తెలుగులో కన్నా తమిళంలో ఎక్కువ సినిమాలు చేసింది. అసలు ఈ మధ్య తెలుగులో కనిపించడమే మానేసింది. ఏంటి విషయమని అడిగితే అల్లు అర్జున్ డైలాగులు కొడుతోంది. అల వైకుంఠపురములో చిత్రానికి మొదట్లో చిన్న టీజర్ వదిలారు గుర్తుందా? అందులో మురళి శర్మ ఎంట్రోయ్ గ్యాప్ తీసుకున్నావు అని అడిగితే దానికి అల్లు అర్జున్ గ్యాప్ తీసుకోలేదు.. వచ్చింది అని చెబుతాడు. ఇప్పుడు హన్సిక కూడా ఇదే డైలాగ్ కొడుతోంది. తెలుగు సినిమాల్లో ఈ మధ్య అసలు కనిపించట్లేదు ఏంటి అమ్మడూ అని అడిగితే గ్యాప్ తీసుకోలేదు.. అదే వచ్చింది అని అంటోంది. తమిళంలో సినిమాలతో బిజీగా ఉండడం వల్ల తెలుగు సినిమాలకు డేట్స్ కేటాయించలేకపోతున్నా అని వగలు పోతోంది.

సందీప్ కిషన్, హన్సిక జంటగా నటించిన తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ చిత్రం రేపు విడుదలవుతోన్న విషయం తెల్సిందే. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా అమ్మడు ఈ డైలాగులు పేల్చింది. అసలు తెనాలి రామకృష్ణ కూడా చేయకపోదునని, డేట్స్ ఖాళి లేవని చెప్పేద్దామనుకున్నానని అంది. కానీ ఈ టీమ్ నాకోసం కొన్నాళ్ళు వెయిట్ చేశారు. అందుకే సైన్ చేశా. ఇకమీదట సంవత్సరానికి ఒక్కటైనా తెలుగు సినిమా చేసేలా జాగ్రత్త పడతా అని చెబుతోంది.

ఏంటి నిజంగా హన్సిక అంత బిజీగా ఉందా.. తన గురించి షూటింగ్ లు ఆపుకుని మరీ వెయిట్ చేసే పరిస్థితి ఉందా అంటే అంత లేదనే సమాధానమేవస్తుంది. ఎందుకంటే హన్సిక తమిళంలో ఈ ఏడాది ఒకే ఒక్క సినిమా చేసింది. మరో సినిమా కూడా చేసింది కానీ అది ఈ ఏడాది విడుదలవ్వదు. మరి సంవత్సరానికి మహా అయితే రెండు సినిమాలే చేస్తూ ఇంత బిల్డప్ ఎందుకిస్తోంది అని కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అది కూడా నిజమే కదూ. ఏదైతేనేం, సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ వంటి కామెడీ ఎంటర్టైనర్ తో తిరిగి ఫామ్ ను అందుకోవాలని కోరుకుందాం.